జ‌నాల‌కు దూరంగా జ‌న‌సేనాని..!

March 12, 2019 at 1:56 pm

పార్టీ పెట్టిన‌ప్పుడు విలువ‌ల గురించి, చెడు రాజ‌కీయాల గురించి, స్వార్థం అంటే ఎంత దారుణ‌మో అనే త‌ర‌హాలో మాట్లాడిన జ‌న‌సేనాని ఇప్పుడు జ‌నాల‌కు దూరంగా ఉంటున్నాడు.. రెండుమూడేళ్ల నుంచి ప్ర‌జ‌ల్లో క‌లిసిపోయి చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తా.. అవ‌స‌ర‌మైతే నిల‌దీస్తా.. అంటూ గొప్ప‌లకు పోయిన ప‌వ‌న్‌క‌ళ్యాన్ ఇప్పుడు పూర్త‌గి అమ్ముడుపోయిన‌ట్టు క‌నిపిస్తున్నారు. సామాన్యుడికే పెద్ద‌పీట అంటూ ఊద‌ర‌గొట్టిన మ‌నిషి అంద‌రూ అసమాన్యుల వెంటే న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎలాంటి **ప‌వ‌ర్‌** లేక‌ముందే ఇలా దిగ‌జారితే ఇక రేపొద్దున నిజంగానే **ప‌వ‌ర్‌లోకి వ‌స్తే ఇంకాఏమైనా ఉందా ప‌రిస్థితి ** జ‌నాలు అనుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

రాష్ర్టం మొత్తంగా తిరుగి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుని పోరాడ‌తాన‌న్న వ్య‌క్తి పోరాటాన్ని చంద్ర‌బాబు ముందు తాక‌ట్టుపెట్టినట్టు క‌నిపిస్తున్నాడు. అతి సామాన్యుడికే ప‌ట్టం క‌డ‌తాం.. అంద‌లానికి వారే స‌రైనోరు.. రేపొద్దున సీట్ల కేటాయింపు వారికే.. గ‌ద్దెపై కూర్చునేది వారే అన్న వ్య‌క్తి ఇప్పుడు పూర్తిగా అధికార దాహంతో చెల‌రేగిపోతున్నాడు. తెర‌వెనుక బాబుతో సీట్ల పంప‌కంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూనే తెర‌ముందు మాత్రం ఒంట‌రిపోరాట‌మే అనే ధోర‌ణితో మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సామాన్యుడిని క‌లిసింది లేదు.. వారికి అంద‌లం ఇచ్చేది లేదన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌ను కూడా రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డిన వ్య‌క్తిగా రూపాంత‌రం చెందాడు.

ఎంత‌సేపు జ‌గ‌న్‌ను నిందించ‌డం త‌ప్ప అధికారంలో ఉన్న స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేకుండా న‌డుచుకుంటున్నాడు. నాలుగున్న‌రేళ్ల‌లో తాను చూసిన ఘోరాల‌ను మ‌ర‌చి, ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌నే టార్గెట్ చేసుకుని ప్ర‌చార ఆర్భాటాన్ని చేస్తున్నాడు. నిందించాల్సిన వ్య‌క్తికి కొమ్ముకాస్తూ నింపాదిగా నిల్చుంటున్నాడు. లోపాయికారి ఒప్పందాల‌ను చేసుకుని ప్ర‌జ‌ల‌కు సినిమా చూపించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ జ‌నం మ‌ధ్య క‌నిపించీ క‌నిపించ‌కుండా వెళ్తున్నాడు. ఆయ‌న నిజ జీవిత‌పు పాత్ర‌ను గ‌మ‌నించి చెప్పే స‌మ‌యంలో స‌రైన బుద్ధి చెప్ప‌లేనంత అమాయ‌కులనుకుంటున్నాడో ఏమో ప్ర‌జ‌ల‌ను. చూద్దాం ఎవ‌రి నాట‌కాల‌కు ఎవ‌రు తెర దింపుతారో ఎన్నిక‌ల వ‌ర‌కు ఆగి మ‌న‌మూ చూద్దాం.

జ‌నాల‌కు దూరంగా జ‌న‌సేనాని..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share