పొన్నాల ప్రతీకారం తీర్చుకొంటాడా..!

November 21, 2018 at 3:39 pm

అనేక ఉత్కంఠ‌ల న‌డుమ జ‌న‌గామ టికెట్‌ను పొన్నాల లక్ష్మయ్య ద‌క్కిచుకున్నారు. అయితే గెల‌వ‌డం మాత్రం అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది. టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డిపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని ఆ పార్టీ నేత‌లే ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. సాధార‌ణంగా అయితే పొన్నాల లాంటి సీనియ‌ర్ నేత‌కు గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగాలి. కానీ ప‌రిస్థితి అలా లేదు. గ‌త మూడేళ్లుగా అస‌లు నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌ల‌కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆయ‌న‌కు స్థానిక ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు లేవ‌ని తెలుస్తోంది. ఏదో కొద్ది మంది నేత‌లు మిన‌హా మిగ‌తా నేత‌లు జారీపోతున్న‌ట్లు సమాచారం.46341455_716626248705325_6653714767473016832_n

వాస్త‌వానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల‌తో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి చేతిలో ల‌క్ష్మ‌య్య ఓట‌మి పాల‌య్యారు. కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా..సోనియాగాంధీతో ప్ర‌త్య‌క్ష సంబంధాలు క‌లిగి ఉన్న పొన్నాల ఓడిపోవ‌డంపై ఒంకింత ఆ పార్టీ అధిష్ఠానం కూడా జీర్ణించుకోలేద‌ట‌. దీనికి తోడు కొంత‌మందికి ఆయ‌న స్వ‌యంగా ప‌ట్టు ప‌ట్టి టికెట్లు ఇప్పించుకున్నారు. అయితే ఈయ‌న‌తో పాటు వారు కూడా ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఆయ‌నకు ఇంటా..బ‌య‌ట ఎదురుదెబ్బ త‌గిలింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీ సాధించి త‌న స‌త్తా ఎంటో చాటాల‌ని భావిస్తున్నారంట‌. అయితే నియోజ‌క వ‌ర్గ రాజ‌కీయ ప‌రిస్థితులు మాత్రం అంతా ఈజీ కాద‌ని తెలియ‌జేస్తున్నాయంట‌.MuthireddyMT

అయితే పొన్నాల ల‌క్ష్య‌య్య మాత్రం గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలు చేసిన ముత్తిరెడ్డిని మ‌ట్టిక‌రిపించాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారంట‌. ఇదే విష‌యాన్ని త‌న‌కు అత్యంత విశ్వ‌స‌నీయంగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కుల వ‌ద్ద చెబుతున్నారంట‌. ఇందులో భాగంగానే పార్టీకి దూరంగా ఉంటున్న వారిని పిలిచి మాట్లాడుతున్నారంట‌. రెడ్డి సామాజిక వ‌ర్గంలోని వ్య‌తిరేక‌త‌ను…బీసీ నేత‌ల్లోని అనుకూల‌త‌ను త‌న గెలుపున‌కు మార్గంగా మ‌ల్చుకోవాల‌ని చూస్తున్నారంట‌. అయితే పొన్నాల విజ‌యం సాధించి ముత్తిరెడ్డిపై ప‌గ తీర్చుకుంటారో లేదో కొద్దిరోజులు ఆగితే గాని తెలియ‌దు మారి. చుద్దాం ఏం జ‌రుగుతుందో..?!

పొన్నాల ప్రతీకారం తీర్చుకొంటాడా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share