బాబు,రాధాకృష్ణలపై పోసాని ఫైర్

March 21, 2019 at 4:21 pm

ఏబీఎన్ రాధాక్రుష్ణా ఇప్ప‌టికైనా మ‌నిషిగా బ‌త‌కాల‌ని, విలువ‌లు మ‌రిచి దిగ‌జారొద్ద‌ని సినీ న‌టుడు, మాట‌ల ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు పోసాని క్రుష్ణ‌ముర‌ళి అన్నారు.. త‌నూ చంద్ర‌బాబు విష‌య‌మై మాట్లాడిన తీరుపై ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్నాన‌న్నారు. త‌న మాట‌ల‌కు తాను పూర్తిగా ఆధారాలు చూపిస్తానన్నారు. త‌న మాట‌ల‌ను బూత‌ద్దంలో చూపించాల్సిన అవ‌స‌రం రాధాక్రుష్ణ భుజాల‌పైకి ఎత్తుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. వార్త‌ల‌ను వార్త‌లాగా మాత్ర‌మే రాయాల‌ని, లేని కూడా క‌ల్పించి రాయ‌డం జ‌ర్న‌లిస్టులుగా త‌గ‌ద‌ని పోసాని హితువు ప‌లికారు.

కాగా, చంద్ర‌బాబుకు కుల‌పిచ్చి ఉంద‌ని పోసాని మ‌రోమారు మీడియా ముందు స్ప‌ష్టం చేశారు. తాను టిక్కెట్లు కేటాయించిన విష‌యాన్ని గ‌మ‌నించిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ విష‌యం ఇట్టే అర్థం అవుతుంద‌న్నారు. ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రూ కోరుకోర‌ని, అది క‌ర్మ సిద్ధాంతాన్ని అనుస‌రించి నిర్ణ‌యించ‌బ‌డుతుంద‌న్నారు. అది వాళ్లు చేసుకున్న త‌ప్పేమీ కాద‌న్నారు. ద‌ళితులుగా త‌క్కువ జాతిగా పుట్టినంత మాత్ర‌న రాజ‌కీయాల‌కు ప‌నికి రాకుండా పోతారా అంటూ పోసాని ప్ర‌శ్నించారు. ఈ దేశంలోపుట్టిన ప్ర‌తి ఒక్క‌రు భార‌తీయుడిగానే ప‌రిగ‌ణింప‌బ‌డుతార‌ని, ఆ త‌ర్వాతే కులాల కుంప‌ట్లు ఉనికిలోకి వ‌చ్చాయ‌ని, అయినా అలాంటి వాటిని కూడా కొంద‌రు ఇలాంటి నాయ‌కులే క్రియేట్ చేశార‌ని పోసాని దుయ్య‌బ‌ట్టారు.

త‌న పార్టీ నాయ‌కులు బ‌హిరంగంగా ప‌లు కులాల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడినా చంద్ర‌బాబు ఎందుకు అడ్డు చెప్ప‌డం లేదో చెప్పాల‌న్నారు. ఏబీఎన్ రాధాక్రుష్ణ‌కు అలాంటివి పెద్ద విష‌యాలు కాదా అని, వాటిని మాత్రం ఎందుకు ప‌దేప‌దే చూప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. పైగా వాటిని క‌ప్పి పుచ్చే విధంగా ఏబీఎన్ చాన‌ల్‌, ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌న్నారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ గురించి లెక్చ‌ర్లు దంచే బాబుగారు ఇలాంటి వారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకుంట‌లేరో కూడా రాధాక్రుష్ణ ప్ర‌శ్నించాల‌ని, ఆ విష‌యాల‌ను తేల్చాల‌ని కోరారు. త‌ను మాట్లాడిన మాట‌లు పాయింట్ టు పాయింట్ పేప‌ర్లో పేర్చిన రాధాక్రుష్ణ టీడీపీకి అంత కొమ్ము కాయాల్సిన అవ‌స‌రం ఏం ఉందో తేల్చాల‌న్నారు. త‌ను మాట్లాడిన మాట‌ల‌కు ఇంకా వివ‌ర‌ణ కావాల్సి వ‌స్తే త‌న ఇంటికి రాధాక్రుష్ణ ఎప్పుడైనా రావొచ్చ‌ని పోసాని సూచించారు.

బాబు,రాధాకృష్ణలపై పోసాని ఫైర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share