బాబు బీఫాం ఇస్తే ..అజ్ఞాతంలోకి టీడీపీ అభ్యర్థి

March 21, 2019 at 3:33 pm

బీ ఫాం ఇవ్వాల‌ని, ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేయ‌డం స‌హ‌జం. బీ ఫాం ఇస్తే ఇక గెలిచినా ఓడినా పార్టీ అధినేత ద్రుష్టిలోనైతే ఉంటాములే అనుకుంటారు. అస‌లు అధినేత‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికే నానా హంగామా చేస్తారు. అలాంటిది బీఫాం ఇచ్చి టిక్కెట్టు కేటాయించినా మాకొద్దు బాబు మీ పార్టీ టిక్కెట్టు అంటూ ప‌రుగులు పెడుతున్నారు ప‌లువురు టీడీపీ అభ్య‌ర్థులు. మొన్న‌టికి మొన్న శ్రీ‌శైలం తెలుగుదేశం అభ్య‌ర్థి బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి తాను పోటీ చేయ‌లేన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా త‌న‌ను ఎక్క‌డ బ‌ల‌వంత‌పెడుతారోన‌ని ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లారు.

స‌రిగ్గా ఇప్పుడూ అదే ప‌రిస్థితి త‌లెత్తింది టీడీపీకి. బీఫాం కేటాయించిన త‌ర్వాత నేను పోటీ చేయ‌డం లేద‌ని పూత‌ల‌ప‌ట్టు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్య‌ర్థి తెర్లాం పూర్ణం ప్ర‌క‌టించారు. టిక్కెట్టు కేటాయించి దాదాపు 36 గంట‌లు గ‌డిచిన త‌ర్వాత తాను పోటీ చేయ‌డం లేద‌ని తెగేసి చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌ను త‌ప్పుకుంటున్న విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌కు కూడా ఫోన్ చేసి చెప్పాడంటే తెలుసుకోవ‌చ్చు పార్టీలో ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఎలా ఉన్నాయోన‌ని. తాను ఇంత చెబుతున్నా త‌న‌ను బ‌ల‌వంతం చేస్తుండ‌డంతో పూర్ణం అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

రెండు మూడు రోజులుగా ఆయ‌న పార్టీ వ్య‌వ‌హారాల‌తో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం, కార్య‌క‌ర్త‌ల‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడ‌ని తెలుస్తోంది. నామినేష‌న్ల ప‌ర్వం ఊపందుకున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం పూర్ణం ఎక్క‌డ ఉన్నారో తెలియ‌కుండా ఉంది. ఆయ‌న ఎక్క‌డ ఉన్నారు.. ఎలా అందుబాటులోకి వ‌స్తారు అనే విష‌య‌మై అధినేత‌తో పాటు అనుచ‌ర గ‌ణం వెతుకులాట ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. తెలుగుదేశం పార్టీపై వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌తతోనే ఒక్కొక్క‌రుగా పార్టీకి దూర‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబు విధానాలు న‌చ్చ‌క‌, బీఫాం ఇచ్చిన త‌ర్వాత కూడా పారిపోవ‌డం చంద్ర‌బాబు హ‌యాంలో న‌డుస్తున్న పార్టీకే సొంతం మ‌ని రాష్ర్ట ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు.

బాబు బీఫాం ఇస్తే ..అజ్ఞాతంలోకి టీడీపీ అభ్యర్థి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share