రాధా TJ రివ్యూ

సినిమా : రాధ‌
నటీనటులు : శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి, అక్ష పార్దాసాని తదితరులు.
సినిమాటోగ్ర‌ఫీ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
ఎడిటింగ్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సంగీతం : ర‌ధ‌న్‌
నిర్మాత : భోగ‌వ‌ల్లి బాపినీడు
ద‌ర్శ‌క‌త్వం : చంద్ర‌మోహ‌న్‌

ఓ వైపు బాహుబలి లాంటి సినిమా..మొత్తం థియేటర్స్ అంతా స్వైర విహారం చేస్తోంది.ఇలాంటి టైంలో రిలీజ్ అయ్యే సినిమా ఓ మోస్తరుగా ఉన్న కలెక్షన్స్ రాబట్టుకోగలడు.ఎందుకంటే బాహుబలి చూసేసిన వాళ్ళకి..చూసినా నచ్చని వాళ్ళకి,సగటు సినిమా ప్రేక్షకుడికి ఈ సినిమా పెద్ద ఉపశమనం లాంటిది.ఆ అవకాశాన్ని రాధ అందుకోలేకపోయింది.

ట్రైలర్ ని చూసి సినిమాని అంచనావేయకూడదు అనేది అనాదిగా వస్తున్న సినీ నానుడి.దీనర్థం ఒక వేళ ట్రైలర్ బాలేకపోయినా సినిమా బాగుండొచ్చు కాబట్టి ట్రైలర్ ని చూసి సినిమాని అంచనా వెయ్యకండి అని సగటు సినీ ప్రేక్షకులకు తలపండిన సినీ మేధావులు ఇచ్చే ఉచిత సలహా అన్నమాట.అది కాస్త ఈ మధ్య  కాలంలో తిరగబడింది.ట్రైలర్ ఆహా ఓహో అని వున్నా సినిమా మాత్రం తలకిందులవుతోంది.అందుకు ఆమధ్యన వచ్చిన కబాలి ట్రెండ్ సెట్ చేస్తే ఇప్పుడొస్తున్న రాధ లాంటి సినిమాలు కంటిన్యూ చేస్తున్నాయి.

అయినా ఈ తరం దర్శకులు సినిమా స్టార్ట్ చెయ్యడానికి ముందే ట్రైలర్ ఎలా ఉండాలి అన్న దాని మీద బాగా ఫోకస్ చేసి ట్రైలర్ కట్స్ కోసం సినిమాని తీసేసి ట్రైలర్ వదిలేసి సినిమాని గాలికొదిలేస్తున్నారనిపిస్తుంది.కనీసం ట్రైలర్ లోని సీన్స్ మినహాయిస్తే సినిమా మొత్తం లో బూతద్దం పెట్టి వెతికినా రిజిస్టర్ అయ్యే సీన్ ఒక్కటి కనపడదంటే ఈ రాధా బాధలు అర్థం చేసుకోవచ్చు.

హీరో కి ఓ కథకుడో,దర్శకుడో ఓ లైన్ చెప్పడం..దానికి హీరో ఇంప్రెస్స్ అయి డెవెలప్ చేయమనడం,లైన్ వరకు ఈజీ గానే చెప్పేస్తారు కానీ డెవెలప్ చేసే సరికి మన వాళ్ళకి తలప్రాణం తొక్కొస్తోంది.అక్కడా ఇక్కడా అరిగిపోయిన సీన్స్ ని అతికించుకుని మల్లి హీరోకి కథను కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తోంది.ఇక్కడ కథని నారేట్ చేసే వాళ్ళను తప్పు పట్టడం లేదు.అది వాళ్ళ జాబ్.ఎలాగైనా తన కథని హీరో కన్విన్స్ అయ్యేలా చెప్పడమే అతని జాబ్.ఇక్కడ ఫెయిల్యూర్ మొత్తం బాధ్యతంతా కథని ఓకే చేసిన హీరోదే.

వినగానే వావ్  అనిపించే లైన్స్ ఎన్నో ఉంటాయి.వాటిని బౌండ్ స్క్రిప్ట్ చేసి తయారు చేయగలిగిన దర్శకులెంతమంది.అసలంటూ స్క్రిప్ట్ వర్క్ ఫుల్ అయ్యాకనే వీళ్ళు సినిమా స్టార్ట్ చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది.స్టార్ట్ చేసేసి తీసుకుంటూ పోతే ఎదో ఒకటి తోచక పోతదా..రాధా సినిమా ని చూస్తే సగటు సినీ ప్రేక్షకుడికి కలిగే అనుమానాలే ఇవన్నీ.

మన వెనక ఎన్ని హిట్స్ వున్నాయి..హ్యాట్రిక్ కోసమా..డబల్ హ్యాట్రిక్ కోసమా మనం ఈ సినిమా చేస్తున్నది అన్న సంగతి పక్కనబెట్టి శర్వానంద్ అసలంటూ ఎం చూసి ఈ స్క్రిప్ట్ కి ఓకే చెప్పాడో అర్థం కాదు.పోనీ కృష్ణుడు..భగవద్గిత..పోలీస్..ఫన్..లైన్ కొంచెం కొత్తగానే ఉందనుకున్న బౌండ్ స్కిప్ట్ అంటూ రెడీ అయ్యుంటే అప్పటికయినా దర్శకుడి పనితనం అర్థమయ్యుండాలి..అప్పుడర్థం అవ్వలేదు..ఇప్పుడు అనుభవించక తప్పదు.

కృష్ణుడంటే పిచ్చబక్తి…మధ్యలో పోలీస్ అంటే ప్యాషన్ తో పెరిగిన కుర్రాడు..పోలీస్ అవ్వడం..ఓ 12  మంది పోలీసులు రాజకీయానికి బలవ్వడంతో పోలీస్ పవర్ ఏంటో చుపించాలన్నదే కథ.పవర్ ఫుల్ పోలీస్ సినిమాలు చూసాం..ఫన్నీ పోలీస్ సినిమాలు చూసాం..రెండూ కలిపినా సినిమాల్ని చూసాం.అయితే ఈ రెంటి కలయికగా  ఎన్ని సినిమాలొచ్చినా మల్లి మల్లి ప్రేక్షకులకి అదొక ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్.థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి ఆ ఇంటరెస్ట్ మొత్తం చచ్చిపోవడానికి 10  నిమిషాలు కూడా పట్టదు.

ఇక ఈ కృష్ణ పోలీస్ ప్రేమ లీలలు అత్యంత పేలవం.ఓ పోలీస్ స్టేషన్ సీన్..ఓ రాజకీయ సన్నివేశం..హీరో హెరాయిన్ టీసింగ్..పాట..ఇది సినిమా మొత్తం..ఒక దాని తరువాత ఒకటిగా ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి..ఈ ఫ్లో మాత్రం దర్శకుడు సినిమా మొత్తం మైంటైన్ చేసాడండోయ్.ఇక కాస్త టైటిల్,మెయిన్ లైన్ జస్టిఫికేషన్ చెయ్యాలనుకున్నాడో ఏమో..సెకండ్ హెరాయిన్ ఎంట్రీ..అదే జస్ట్ ఇద్దరు భామలతో పాటకోసం.ఇలా అటు కమర్షియల్ సినిమా కాకుండా..కామన్ సినిమానూ కాకుండా మిగిలిపోయింది రాధ.

స్క్రీన్ ప్లే ని నిందించలేము..ఎందుకంటే అసలంటూ స్క్రిప్ట్ వర్క్ అయినట్టు కనిపించదు..ఇక స్క్రీన్ ప్లే బాగుండాలనుకోవడం దురాశే.ఆర్ ఆర్ ,బీజీమ్ ఎదో సి గ్రేడ్ సినిమాని గుర్తుకు తెస్తాయి.సినిమాటోగ్రఫీ పేలవం.ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు.మాటలు,పాటలు..ఇలా ఏ సాంకేతిక అంశము కూడా సినిమాకి సాయం చేయలేకపోయాయి.

ట్రైలర్స్,కాంబినేషన్ ని చూసి సినిమాకి జనాలు ఎగబడి రోజులకి కూడా కాలం చెల్లిపోయింది.శర్వానంద్ తనపాత్ర మేరకు బాగా నటించాడు.అది చాలదు సినిమాని కాపాడ్డానికి.లావణ్య త్రిపాఠి పాటలకు పనికొచ్చింది.అక్ష కూడా ఒక చెయ్యేసింది లావణ్య తో పాటి.విల్లన్ గా రవి కిస్షన్ బానే ట్రై చేసాడు.కమెడియన్స్ షకలక శంకర్ డి కాస్త నిడివి ఉన్న పాత్ర.కామెడీ లేదు..ఎమోషన్ పండలేదు…కథని,హీరోని ఎలివేట్ చేసే సన్నివేశమే కానరాదు.ఇవి చాలనుకుంటా రాధ బాధలు చెప్పడానికి.

పంచ్ లైన్:  రా”(బా)”ధ
రేటింగ్:  2 / 5