రావెల ధిక్కార స్వరం .. తీవ్రస్థాయిలో నిప్పులు

May 12, 2018 at 3:49 pm
ravela kishore babu

ఆయ‌న ఎస్సీ నేత‌. మాజీ మంత్రి, 2014లో అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఐఆర్ ఎస్ ఉద్యోగి. అప్ప‌ట్లోనే చంద్ర‌బా బును మెప్పించి కేబినెట్లో సీటును కూడా కొట్టేసిన నాయ‌కుడు. ఆయ‌నే గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన రావెల కిశోర్ బాబు. అయితే, అనూహ్యంగా ఈయ‌న వ్య‌వ‌హారాల్లోకి కుటుంబ స‌భ్యులు ఎంట‌ర‌య్యారు. అదేవిధంగా ఉన్న‌తాధికారుల‌ను సైతం లెక్కచేయ‌కుండా ప్ర‌తిప‌నికీ ఇంత‌ని రేటుగ‌ట్టి వ‌సూలు చేశార‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. ఇక‌, ఆయ‌న కుమారులు ఇద్ద‌రూ వారి చేష్ట‌ల‌తో తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యారు. ఇక‌, టీడీపీ కేడ‌ర్‌ను ప‌ట్టించు కోర‌నే అప‌వాదూ ఉంది. ఈ నేప‌థ్యంలోనే గ‌త ఏడాది జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రావెల‌ను తొల‌గించారు. అయితే, ఆ త‌ర్వాత కూడా రావెల వ్య‌వ‌హార శైలి మార‌లేదు.

 

అంతేకాదు, త‌న‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించార‌నే దుగ్ధ‌తో ఆయ‌న టీడీపీని టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబును తీవ్రంగా విమ‌ర్శించిన ఎమ్మార్పీఎస్ నాయ‌కుడు మంద కృష్ణ ను త‌న ఇంటికి ఆహ్వానించి భారీ ఎత్తున విందు ఏర్పాట్లు చేశారు. అప్ప‌ట్లోనే ఈ విష‌యం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఒకింత సైలెం ట్ అయిపోయి న రావెల.. ఇప్పుడు తాజాగా మ‌ళ్లీ త‌న నిర‌స‌న గ‌ళాన్ని ఉధృతం చేశాడు. సొంత పార్టీ నేతలపైనే  రావె ల తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం ఏంటని ప్రశ్నించా రు. దళిత ప్రజా ప్రతినిధుల నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం మంచిది కాదని హితవు పలికారు.

 

రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఇలాంటి చర్యలతో దళిత జాతిలో అభద్రతాభావం పెరుగు తుందన్నారు. ఇటీవ‌ల‌ మాదిగ విద్యార్థిపై  ఆర్టీసీ చైర్మ‌న్ వర్ల రామ‌య్య చేసిన‌ వ్యాఖ్యలను కూడా రావెల ప్ర‌స్తావించాడు. ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్ర ఖండిస్తున్నామన్నారు. వర్ల దుహంకారాన్ని తగ్గించుకోవాలని హెచ్చరించారు. వర్ల పట్ల మాదిగ జాతి ఆగ్రహంతో రగిలిపోతోందన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు. వర్ల తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలంతా ఉద్యమానికి సిద్ధం కాకముందే వర్ల తన తప్పును దిద్దుకోవాలని సూచించారు. 

 

ఇలా రావెల దూకుడు పెంచ‌డానికి రీజ‌న్ ఏంట‌నే విష‌యం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. ప్రధానంగా ఎలాగూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా పార్టీ మార్పు త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలోనే రావెల రెచ్చిపోతున్నా డ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న వైసీపీ వైపు చూస్తున్నార‌ని స‌మాచారం. వచ్చే ఎన్నిక‌ల నాటికి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

రావెల ధిక్కార స్వరం .. తీవ్రస్థాయిలో నిప్పులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share