టీడీపీ ఆ సీటిచ్చినా.. స‌బ్బం గెలుస్తాడా..?

July 14, 2018 at 9:47 am
Sabbam Hari-

మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిసంక‌ట స్థితిలో రామోజీ.. అస‌లేం జ‌రిగింది?క‌లు ఉన్నాయి. అధికార టీడీపీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వైసీపీ , జ‌న‌సేన‌ల ధాటిని త‌ట్టుకుని గెలుపు గుర్రం ఎక్క‌గ‌లిగే వారినే ఎన్నిక‌ల్లో నిల‌బెట్టాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అభ్య‌ర్థుల ఖ‌రారుపై తెర‌చాటుగా మంత‌నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ ఉత్త‌ర నియోజ క‌వ‌ర్గాన్ని ఇంకా పార్టీలోకే చేర‌ని మాజీ కాంగ్రెస్ ఎంపీ, సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌ స‌బ్బం హ‌రికి అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే,ఈ య‌న‌కు ఇక్క‌డ ప‌ట్టు ఉండ‌డం, గ‌తంలో అన‌కాప‌ల్లి ఎంపీగా ఆయన‌కు అనుభ‌వం ఉండ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్న ప‌రిణామాలు. అయితే, ప‌రిస్థితులు ఎంత‌గా క‌లిసి వ‌చ్చినా.. పార్టీలో కూడా నేత‌లు క‌లిసి రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది క‌దా?! 

 

అంటే.. ఉత్త‌ర టికెట్‌ను చంద్ర‌బాబు.. స‌బ్బం హ‌రికి కేటాయించినా.. అక్క‌డ క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయాల్సిన వారు, ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేయాల్సిన వారు మాత్రం దిగువ స్థాయి నాయ‌కులే. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి అనూహ్యంగా మారుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ టికెట్‌పై టీడీపీలో చాలా మంది ఆశావ‌హులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. విశాఖ నగర పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఉత్తర నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు ఎక్కువే. 2009 ఎన్నికల ముందే ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జ్‌గా భరణికాన రామారావును నియమించారు. ఆ ఎన్నికల్లో రామారావు భార్య జయ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 

 

2014 ఎన్నికల్లో ఇక్క‌డ‌ బీజేపీ త‌ర‌ఫున విష్ణుకుమార్ రాజు పోటీ చేసి తెలుగుదేశం మ‌ద్ద‌తుతోనే గెలిచారు. ఆ తరువాత ఇన్‌చార్జిని నియమించలేదు. వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఇదే నియోజకవర్గంలో నివసిస్తుండడంతో పోటీకి మొగ్గు చూపుతున్నారు. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మార్గదర్శనంలో ముందుకు సాగుతున్న స్వాతి ప్రమోటర్స్‌ అధినేత మేడపాటి కృష్ణారెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. 

 

ఏదిఏమైనా విశాఖ ఉత్తరంలో త‌మ‌కంటే.. త‌మ‌కే టికెట్ కావాల‌ని అధికార‌పార్టీలో నేత‌ల మ‌ధ్య తీవ్ర ఫైట్ ఉద్రిక్తంగా మారింది. మ‌రి ఈ నేథ్యంలో పార్టీఅ ధిష్టానం స‌బ్బం హ‌రికి టికెట్ ఇచ్చినా.. ఆయ‌న‌ను గెలిపించేందుకు పార్టీ కేడ‌ర్ ఏమేర‌కు కృషి చేస్తుంద‌నే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఎలాముందుకు వెళ్తారో చూడాలి.

టీడీపీ ఆ సీటిచ్చినా.. స‌బ్బం గెలుస్తాడా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share