విన్నర్ TJ రివ్యూ

February 24, 2017 at 10:54 am
Winner-movie-review

సినిమా: విన్నర్
రేటింగ్ : 2.75 / 5
పంచ్ లైన్: విన్నర్ విన్ కాలేక పోవచ్చు
నటీనటులు : సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్,  జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్
కెమెరా : చోటా కె.నాయుడు
క‌థ‌ : వెలిగొండ శ్రీనివాస్‌
ఎడిట‌ర్‌ : గౌత‌మ్ రాజు
సంగీతం : త‌మ‌న్‌
ప్రొడక్షన్ హౌస్ : ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాతలు : న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు
స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం : గోపీచంద్ మ‌లినేని

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ హీరోగా జగపతిబాబు సపోర్టింగ్ రోల్ లో నటించిన ఈ విన్నర్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

బెంగళూరు రేస్ కోర్స్ లో జరిగే గుర్రపు పందాలు, అక్కడ జరిగే బెట్టింగ్స్ కి కొంచెం ఫ్యామిలీ ఎమోషన్ కొంచెం లవ్ స్టోరీ కలిపి మిక్సచేసి విన్నర్ స్టోరీ ని రెడీ చేసాడు కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌. కొడుకు ఇష్టాలకంటే డబ్బే ప్రధానంగా వుండే తండ్రిగా ముకేశ్ ఋషి, కొడుకే ప్రపంచం గా బ్రతికే తండ్రిగా జగపతిబాబు నటించారు. మొదట తండ్రిని ద్వేషించి అతనికి దూరమయ్యి, తరువాత తండ్రిగోప్పతనాన్ని తెలుసుకొని తండ్రికి దగ్గరవ్వాలని ప్రయత్నించే కొడుకు పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించాడు.

ఇంకా కథలోకి వెళితే చిన్నతనములోనే తండ్రిని ద్వేషించి ఇంట్లోనుంచి పారిపోయి పెరిగి పెద్దవుతాడు సిద్ధార్థ్ రెడ్డి (సాయి ధర్మతేజ్ ). అనుకోకుండా ఒకరోజు సితారను (రకుల్ ప్రీత్ సింగ్) చూసి లవ్ లో పడిపోతాడు. ఇంకా ఆ తరువాత అంతా సితార తన ప్రేమను అంగీకరించటానికి రెగ్యులర్ తెలుగు హీరోలాగానే ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయత్నం లో తాను ఎదుర్కొన్న సవాళ్లేంటి, చిన్నతనంలో తన తండ్రిని వదిలేసి వచ్చినందుకు బాధపడి తిరిగి తన తండ్రిని పొందడానికి పడిన కష్టాలేంటి అన్నదే కథాంశం.

గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథాంశం బావున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ లవ్ స్టోరీ కి కొంచెం కామిడీ ని జోడించి రెగ్యులర్ ఫార్ములాతోనే తీసిన విధానం వల్ల సినిమా కాస్త బోరింగ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ లో అయినా డైరెక్టర్ టాలెంట్ చూపించుకోవటాని, సినిమాని పీక్స్ కి తీసుకెళ్ళటానికి ఈ కథ లో రెండు బలమయిన అంశాలే వున్నాయి ఒకటి తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్, ఇంకొకటి హార్స్ రైడింగ్, ఈ రెండిటిని దర్శకుడు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయాడు. దానివల్ల ప్రేక్షకుడు సినిమాకి కనెక్ట్ అయినట్టే అయ్యి వెంటనే బయటికి వచ్చేస్తాడు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే నెక్స్ట్ ఏంజరగబోతుందో ప్రేక్షకుడికి ముందే అర్థమయిపోతుంది కనీసం స్క్రీన్ ప్లే అయినా టైట్ గా ఉండుంటే బావుండేది.
చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బావుంది. థమన్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ కాలేక పోయింది.

ఇంకా నటీ నటుల విషయానికొస్తే హీరో తండ్రి పాత్రలో జగపతి బాబు ఈ సినిమాకి ప్రాణం పోసాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాకి ఆయన అప్పీరెన్స్ ఒక పెద్ద అసెట్. ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటన అద్భుతం గా వుంది. హీరోగా సాయి ధర్మతేజ్ లవర్ బోయగా ఫస్ట్ హాఫ్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఇంకా మెచ్యూరిటీ రావాలనిపించింది. ఫైట్స్ లో ఇంతకు ముందు సినిమాలలో లాగానే చాలా బాగా చేసాడు. ఇంకా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్షన్ కి స్కోప్ లేని పాత్రా అయినప్పటికీ గ్లామర్ షో తో అలరించింది. కామిడీ పరంగా వెన్నలకిషోర్, ఆలీ, పృథ్వి, బిత్తిరి సత్తి అలరించారు.ఐటెం సాంగ్ లో అనసూయ మెరిసింది.

ఓవరాల్ గా కథలో కంటెంట్ ఉన్నప్పటికీ కధనం లో కొత్తదనం లేకపోవటంతో ఈ విన్నర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన లెవెల్ లో విన్ కాలేకపోవచ్చు.

విన్నర్ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share