బెంగ‌ళూరు టెస్టులో శిఖర్‌ ధావన్‌ రికార్డ్

June 14, 2018 at 2:55 pm
Sikhar dhawan, Team india, Benglore, Afganisthan, test match

టీమిండియా తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్ హోదా పొందిన ఆసియా దేశం అప్గ‌నిస్తాన్‌తో బెంగ‌ళూరులో జ‌రుగుతోన్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మ‌న జ‌ట్టు ఈ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఇండియా లంచ్‌ సమయానికి 27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌(104 బ్యాటింగ్‌; 91 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లు), మురళీ విజయ్‌(41 బ్యాటింగ్‌; 72 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) లు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు.

టెస్ట్ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన జ‌ట్టులో ఆట‌గాడు లంచ్‌కు ముందు సెంచ‌రీ చేసిన ఘ‌న‌త‌ను మ‌న జ‌ట్టు తొలిసారి సాధించింది. ధావన్‌ 87 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ నమోదు చేయడం ద్వారా భారత్‌ ఈ ఫీట్‌ను సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు ఏ టీంఇండియా క్రికెట‌ర్ సాధించ‌లేదు. 2006లో సెయింట్‌ లూసియాలో వెస్టిండీస్‌తో జరిగిన ​మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 99 పరుగులు చేశాడు. ఇదే ఇప్పటివరకూ టెస్టు ఓపెనింగ్‌ రోజున లంచ్‌కు ముందు ఒక భారత ఆటగాడు చేసిన అత్యధిక స్కోరుగా ఉంది.

ఇప్పుడు ధావ‌న్ దానిని బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టు ప్రారంభపు రోజు లంచ్‌కు ముందు సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో వి ట్రంపర్‌(1902), సీ మకార్ట్నీ(1921), బ్రాడ్‌మన్‌(1930), మజిద్‌ ఖాన్‌(1976), డేవిడ్‌ వార‍్నర్‌(2017)లు ఉన్నారు. ఇప్పుడు వారి సరసన ధావన్‌ చేరడం మరో విశేషం.

బెంగ‌ళూరు టెస్టులో శిఖర్‌ ధావన్‌ రికార్డ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share