సింగం-3 TJ రివ్యూ

February 9, 2017 at 3:01 pm
69000

సినిమా : S3-య‌ముడు-౩
రేటింగ్ : 3 .25 /5
పంచ్ లైన్ : సిరీస్ మారినా స్పీడ్ తగ్గలేదు

నటీనటులు : సూర్య, అనుష్క, శ్రుతిహ‌స‌న్‌, రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర
ఛాయాగ్రహణం : ప్రియన్‌
సంగీతం : హారిస్‌ జయరాజ్‌
కూర్పు : విటి విజయన్‌, టి.ఎస్‌.జయ్‌
నిర్మాత : మల్కాపురం శివకుమార్‌
సంస్థ : స్డూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌.
రచన.. దర్శకత్వం : హరి

ఇదిగో వస్తోంది..అదిగో వస్తోంది..అంతలోనే తూచ్ ఇప్పుడే కాదు.ఇలా జనతా గారేజ్ రిలీజ్ టైం కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా అటు సినిమా,రాజకీయ(అమ్మ మరణం,ఆరవ కొట్లాటలు), సామాజిక కష్టాలన్నీ(జల్లి కట్టు) నెత్తికెత్తుకుని ఎట్టకేలకు విడుదలయ్యింది.ఇన్నాళ్లు ఎదురుచూసినా సాఫీగా విడుదలయ్యిందా అంటే అదీ లేదు..నార్మల్ డెలివరీ ఎటూ కాలేదు,కనీసం సిజేరియన్ అయినా ప్రశాంతంగా అవుతుందిలే అనుకుంటే అంతలోనే బిడ్డ అడ్డం తిరిగిన చందాగా తెలుగు రాష్ట్రాల్లో ఫైనాన్స్ క్లియరెన్స్ వివాదాలతో మార్నింగ్ షో పడనే లేదు.

ఎట్టకేలకు మధ్యాహ్నం మ్యాట్నీ టైం కి బొమ్మ పడింది.అప్పటికీ విసుగురాని అభిమానులు పలుచగానే సినిమాకి వచ్చారు.సినిమా విడుదలకి కష్టాలున్నాయేమో కానీ సినిమా చుసిన ప్రేక్షకుడికి మాత్రం కరువు తీరిపోయేలా ఫుల్ మీల్స్ పెట్టేసారు దర్శకుడు హరి,సింగం సూర్య కలిపి.

దర్శకుడు హరి సినిమా అనగానే రేసీ స్క్రీన్ ప్లే ఉంటుంది.అది కాస్తా సింగం సిరీస్ లలో ఇంకో మోతాదు ఎక్కువగానే ఉంటుంది.ఇక ఈ S – 3 అయితే పీక్స్.మాస్ గా చెప్పాలంటే ఉచ్చ పోసుకోవడానికి కూడా గ్యాప్ ఉండదు అన్నంతగా పరిగెడుతుంది సినిమా.పరిగెత్తి పరిగెత్తి ఎక్కడో ఒకచోట ఆపాలని ఆపడం తప్ప ప్రేక్షకుడికి మాత్రం విసుగు రాదు అన్నంత రేసీ గా ఉంటుంది స్క్రీన్ ప్లే.

ఈ సినిమాకున్న బ్యూటీ ఏంటంటే మొదటి రెండు సినిమాల్ని ఇందులో ఇంజెక్ట్ చేసిన విధానం అద్భుతం.ఎక్కడికక్కడ పాత సిరీస్ పాత్రల్ని వాడుకున్న తీరు మెచ్చుకోవాల్సిందే.ఇక ఆస్ట్రేలియన్ పోలీస్ సూర్య ని ఆపేసినప్పుడు డ్యానీ ఫ్లాష్ బ్యాక్ ని వాడి ఆస్ట్రేలియన్ పోలీస్ తో సింగం సెల్యూట్ కొట్టించుకోవడం హై లైట్.ఇలా ఒకటేమిటి ఇటువంటి సీన్స్ కావాల్సినన్ని వున్నాయి.

కర్ణాటక లో జరిగిన ఓ పోలీస్ ఆఫీసర్ హత్య కేసుని డీల్ చెయ్యడానికి ఆంధ్ర నుండి నరసింహం స్పెషల్ గా కర్ణాటక వెళ్లడంతో మొదలయ్యే కథ ఆ కేసుని నరసింహం ఎలా చ్చేదించాడు..అసలు హత్య ఎందుకు జరిగింది దాని వెనకున్నదెవరు..వాళ్ళందరిని సింహం ఎలా వేటాడిందన్నదే కతఅంశం.సింగం-2 కి ఈ S – 3 కి చాలా పోలికలు కనిపిస్తాయి.అయినా ప్రేక్షకుల్ని గుక్కతిప్పుకోనీయకుండా చేసింది స్క్రీన్ ప్లే నే.

మొదటి రెండు భాగాలతో పోలిస్తే కామెడీ,ఫామిలీ ఎమోషన్ ఇందులో మోతాదు తగ్గింది.సినిమా మొత్తం ఆక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయినా,చేజ్లు,ఎత్తులు,పై ఎత్తులు ఇలా గ్యాప్ లేకుండా పరిగెడుతున్నా ప్రేక్షకుడు ఎక్కడా బొర్ ఫీల్ ఎవ్వడు..కారణం వీటన్నిటికీ కావాల్సిన ఎమోషన్ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తూ ఉండడమే.అయితే ఈ రెండిటి బ్యాలెన్స్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపిస్తుంది.

సింగం అంటే సూర్య.. అదొక బ్రాండ్ ఇప్పుడు.ఇండియన్ స్క్రీన్ పైన ఈ రేంజ్ లో సీక్వెల్స్ ఉర్రుతలూగించడం ఒక్క సింగం కె చెల్లింది.క్రెడిట్ అంతా సూర్య దే.సూర్య కాకుండా వేరే ఎవరు చేసున్న ఒకటి మహా అయితే బొటాబొటిగా రెండో పార్ట్ చూసే వాళ్లేమో కానీ పార్ట్ పార్ట్ కి పీక్స్ చూపెడుతోంది సింగం సిరీస్ అంటే సూర్య వల్లనే.అనుష్క సైజు జీరో లావు కవర్ చెయ్యడానికి కెమెరామెన్ దర్శకుడు చాలానే తిప్పలు పడ్డారు.అందుకేనేమో పాపం పాప స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ.ఇక శృతి హాసన్ ఉన్నంతలో హన్సిక ని రీప్లేస్ చేసింది.విల్లన్ గా శరత్ సక్సేనా పర్లేదనిపించాడు.మెయిన్ విలన్ ఠాకూర్ అనూప్ సింగ్ బాడీ పరంగా బాగున్నా సూర్యకి ధీటైన ప్రతినాయకుడి ఎక్స్ప్రెషన్స్ పలికించలేకపోయాడు.మిగిలిన వాళ్లంతా తల ఒక చెయ్యేసి పర్లేదనిపించారు.

దర్శకుడు హరి కథ మీద ఇంకొంచెం వర్క్ అవుట్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది.దాన్ని స్క్రీన్ ప్లే కవర్ చేసినా రెండిటి బాలన్స్ ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది అనిపిస్తుంది.జైల్లోని హ్యాకర్ ని వాడిన తీరు బాగుంది.e – వేస్ట్ ,మెడికల్ వేస్ట్ గురించి ఇంకాస్త బెటర్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు.ఆస్ట్రేలియన్ ఎపిసోడ్ బాగుంది.విలన్ కి కౌంటర్ గా సింగం స్టేషన్ లో విలన్ ని నిలబెట్టే లాంటి సీన్స్ అద్భుతంగా వున్నాయి.సినిమాకి ఏదయినా లోపం ఉందంటే అది బ్యాక్ గ్రౌండ్ స్కోర్.బాలేదా అంటే..చాలా బాగుంది కాకపోతే సీన్ ని సిట్యుయేషన్ ని డైలాగ్స్ ని డామినెటే చేసేంతగా వుంది బిజీ.నేను చూసింది సి-సెంటర్ లోని ఒకప్పటి థియేటర్ ప్రభావమో ఏమో కానీ బిజీ చాలా చోట్ల మరీ డామినేటింగ్ గా అనిపించింది.మాటలు సినిమా టెంపోని క్యారీ చేశాయి,పాటలు దేవి శ్రీ అంత ఇంపాక్టింగ్ గా లేవు.ఆక్షన్ సీన్స్ అన్ని పీక్స్ చూపెట్టేసారు.సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ని సినిమా మూడ్ ని పర్ఫెక్ట్ గా హేండిల్ చేసాడు కెమెరామెన్.ఎడిటింగ్ వర్క్ బాగుంది.

సినిమా మొదలయిన ఒక అరగంట మినహా సింహం వేటాడుతూనే ఉంటుంది.టెక్నికాలిటీస్ జోలికెళ్లకుండా కొత్తదనం అంటూ పెదవి విరచకుండా అసలు సింగం ఏంటి..దీన్నుండి సగటు సినీ ప్రేక్షకుడు ఏమి ఆశిస్తున్నాడో వాటికి రెండు డోసులు అదనగానే వడ్డించారు S -3 లో.

సింగం-3 TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share