టీడీపీలో కలకలం ..సుజనా చౌదరిపై ఐటీ దాడులు

October 10, 2018 at 1:09 pm

ఏపీలో అధికార టీడీపీకి చెందిన మంత్రులు, ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల‌ను టార్గెట్‌ చేస్తూ ఐటీ చేసిన దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టేట్‌ అధికారులు కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన వ్యాపార సంస్థలపై వరుస దాడులు చేశారు. సుజనా చౌదరికి చెందిన 160 కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లను సైతం వారు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే అధికార టీడీపీ వాళ్లు మోడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై కక్ష కట్టి తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల కంపెనీలపై వరుసగా ఐటీ దాడులు చేయిస్తున్నట్టు గగ్గోలు పెడుతున్నారు.

సుజనా చౌదరికి చెందిన కంపెనీలపై గతంలోనే చాలా ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం విపక్షాల నుంచి ఆయన వ్యాపారాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలాగే అప్పుడే ఆయన కంపెనీలపై గతంలో ఒకటి రెండు సార్లు ఐటీ దాడులు జరిగినట్టు కూడా వర్తాలు వచ్చాయి.సుజనా విదేశీ బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణాలు తీసుకుని వాటికి ఎగనామం పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలపై కోర్టులో కేసులు నానుతుండడంతో పాటు సుజనా చౌదరికి అరెస్ట్‌ వారెంట్లు కూడా గతంలో జారీ అయ్యాయి.sujana-chowdary

ఇప్పుడు తాజాగా ఆయనకు చెందిన 160 కంపెనీల డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకోవడంతో తెలుగుదేశం వర్గాల్లో ప్రకంపన‌లు రేగుతున్నాయి. ఈ లిస్టులోనే అదే పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఒక మంత్రి కూడా ఈడీ నెక్ట్స్‌ టార్గెట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ వరుస దాడులతో తెలుగుదేశం ప్రజాప్రతినిధులు భయం గుప్పెట్లో ఉంటున్నారు.

టీడీపీలో కలకలం ..సుజనా చౌదరిపై ఐటీ దాడులు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share