తొలి అనుభ‌వం కోసం తొంద‌ర‌ప‌డేవారిలో ముందున్న‌ది వారే

May 29, 2018 at 3:27 pm

తొలి అనుభ‌వం కోసం తొంద‌ర‌ప‌డేవారిలో ముందున్న‌ది ఉత్త‌రాది వారా…? ద‌క్షిణాదివారా.? స‌్త్రీలు, పురుషుల్లో ముందుగా ఎవ‌రు తొలి అనుభ‌వాన్ని పొందుతున్నారు..?  తొలిసారి  ఏ వ‌య‌స్సులో లైంగికానుభూతిని పొందుతున్నారు..? ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌కు స‌మాధానం చెబుతోంది ఇటీవ‌ల నిర్వ‌హించిన జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే. ఈ స‌ర్వేలో దాదాపుగా రెండు ల‌క్ష‌మ మంది నుంచి శాంపిల్స్ సేక‌రించి, వివ‌రాలు వెల్ల‌డించారు. ఇప్పుడీ గ‌ణాంకాలపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ బిజీలైఫ్‌లో మాన‌వలైంగిక‌జీవితంపై ప్ర‌భావితం చూపే అంశాలు కూడా ఇప్ప‌డీ స‌ర్వేతో వెల్ల‌డైన‌ట్లు ప‌లువురు భావిస్తున్నారు. 

 

 దేశ‌వ్యాప్తంగా దాదాపు రెండు లక్ష మందితో నిర్వహించిన ఈస‌ర్వేలో లైంగిక జీవితానికి సంబంధించిన పలు అంశాల్ని వెల్లడించారు. ఈ సర్వేలో లక్ష మంది పురుషులు.. లక్ష మంది మహిళలు పాల్గొన్నారు. అయితే తొలిసారి శారీర‌క సంబంధం విషయంలో ప్రాంతాల వారీగా.. వారి ఆర్థిక పరిస్థితులు.. ఉద్యోగం త‌దిత‌ర అంశాలెన్నో ముడిపడి ఉన్నాయని ఈ స‌ర్వేలో వెల్ల‌డైంది. అయితే పురుషులతో పోలిస్తే స్త్రీలే చాలా త్వరగా తొలి అనుభవాన్ని పొందుతున్నట్లుగా తేలింది. దేశంలో యువతుల్లో తొలి లైంగిక అనుభవం 15 నుంచి 19 సంవత్సరాల లోపే ఉంటుందని స‌ర్వేలో తేలింది. అదే సమయంలో పురుషుల విషయానికి వస్తే ఇది 20-24 ఏళ్ల మధ్య ఉన్నట్లుగా తేలింది. ఎందుకీ తేడా వ‌చ్చిందంటే.. పురుషులు ఉద్యోగం కోసం వేచిచూడ‌డం.. అదేస‌మ‌యంలో యుక్త‌వ‌య‌స్సులోనే అమ్మాయిల‌కు తొంద‌ర‌గా పెళ్లి చేయ‌డం వ‌ల్లే ఈ తేడా వ‌చ్చిన‌ట్లు తేలింది.

 

ఇక ఉత్త‌రాదివారు, ద‌క్షిణాదివారి మ‌ధ్య‌కూడా చాలా తేడా ఉంది. ఉత్త‌రాది వారే లైంగిక జీవితంలో చురుగ్గా ఉంటున్నట్లు తేలింది. నిజానికి దేశంలో ఇప్ప‌టికీ శ‌`ంగారాన్ని త‌ప్పుగా భావిస్తున్నారు. 15-24 వయసులో ఉన్న ఒంటరి పురుషుల్లో 11 శాతం మంది.. 2 శాతం మంది మహిళలు మాత్రమే పెళ్లికి ముందు సెక్స్ చేసినట్లుగా ఈ స‌ర్వేలో చెప్పుకున్నారు. అయితే పెళ్లికి ముందు సెక్స్ చేసిన వారిలో అత్యధికంగా చత్తీస్ గఢ్ రాష్ట్రంలో 21.1శాతం మంది ఉండగా.. తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం 20.7 శాతంలో నిలిచింది. దేశంలో 90 శాతం మందికి తొలి అనుభవం 30 ఏళ్ల లోపే ఉంటుందని స‌ర్వేలో చెప్పారు. కేవలం 10 శాతం మందికి మాత్రమే 30 ఏళ్ల తర్వాత పొందుతున్నారు. 

 

అయితే ఈస‌ర్వేలో ఒంట‌రి మ‌హిళ‌లు, పురుషుల విష‌యంలో మాత్రం యువ‌త పోక‌డ ఏలా ఉందో తేలింది. ఒంటరి మహిళలు.. పురుషులు తాము ఎక్కువగా సెక్స్ లో పాల్గొన్నది తమ బాయ్ ఫ్రెండ్ తో కానీ గర్ల్ ప్రెండ్స్ తో కానీ అని చెప్పటం గమనార్హం. 70 శాతం మంది పురుషులు తమ గాళ్ ఫ్రెండ్ తో సెక్స్‌లో పాల్గొన్నట్లుగా చెప్పారు. దాదాపు 65 శాతం మంది మహిళలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో సెక్స్‌లో పాల్గొన్న‌ట్లు ఒప్పుకున్నారు. ఇక.. సహజీవనం చేస్తున్న వారితో సెక్స్ చేస్తున్న విషయంలో మహిళలు.. పురుషులు ఒకేలా ఉన్నారు. అనుకోకుండా కలిసిన వ్యక్తితో సెక్స్ చేసే విషయంలో పురుషులు ముందువ‌రుస‌లో ఉంటే… మహిళలు కొంత వెనుకే ఉన్నారు.  కొస‌మెరుపు ఏమిటంటే.. సెక్స్ వర్కర్లతో శృంగారం విషయంలో పురుషులు ఎక్కువగా ఉంటే.. మహిళలు తక్కువగా ఉండటం.

తొలి అనుభ‌వం కోసం తొంద‌ర‌ప‌డేవారిలో ముందున్న‌ది వారే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share