వైసీపీలోకి ఎస్వీ మోహ‌న్‌రెడ్డి..

March 21, 2019 at 4:46 pm

క‌ర్నూలు జిల్లాలో అధికార టీడీపీ పార్టీ కోలుకోవ‌డం ఇక క‌ష్ట‌మే. ఆ పార్టీ నేత‌లు ఒక్కొక్క‌రుగా రాజీనామాలు చేస్తున్నారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం వైసీపీ గూటికి చేరుతున్నారు. మొన్న‌టికిమొన్న ప‌లువురు నేత‌లు పార్టీని వీడి వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే. అందులోనూ టికెట్లు పొందిన త‌ర్వాత కూడా అభ్య‌ర్థులు ఆ పార్టీ వీడ‌డంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పార్టీ అదినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తాజాగా.. మ‌రో భారీ షాక్ త‌గిలింది. కర్నూలు సిటీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీకి రాంరాం ప‌లికారు.

ఈ ప‌రిణామాల‌తో జిల్లాలో టీడీపీ గ‌ల్లంతు కావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇటీవ‌ల ఆదాల‌, బుడ్డా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు టీడీపీకి గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే. దీని నుంచి కోలుకోక‌ముందే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి రూపంలో మ‌రో దెబ్బ‌ప‌డింది. చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌కుండా మోసం చేస్తే.. ఏకంగా పార్టీకి రాజీనామా చేసి.. ఎస్వీ దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు. నిజానికి.. 2014 ఎన్నికల అనంతరం వైసీపీని వీడిన ఆయన టీడీపీలో చేరిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ రాకపోవడంతో ఎస్వీ తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు. ఆయన మళ్లీ సొంతగూడు వైసీపీకి వెళ్లాలని నిర్ణయించారు. త‌న అనుచ‌రుల‌తో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే.. చేసిన తప్పును సరిదిద్దుకుని మ‌ళ్లీ వైసీపీలో చేరుతానని ఆయ‌న వెల్ల‌డించారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎం అవుతారన్నారు. వైసీపీ అభ్య‌ర్థి హ‌ఫీజ్‌ఖాన్‌కు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

వైసీపీలోకి ఎస్వీ మోహ‌న్‌రెడ్డి..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share