చంద్ర‌బాబుపై త‌మ్మారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

February 11, 2019 at 11:45 am

టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. `నా ఆలోచ‌న‌` అనే యూట్యూబ్ చానెల్‌లో ఆయ‌న మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న రాకుండా అడ్డుకుంటున్న‌ది చంద్రబాబేమోన‌న్న అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌ని అన్నారు. బాబు అడ్డుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే స‌వాల‌క్ష ఆరోప‌ణ‌ల‌తో త‌ల్ల‌డిల్లుతున్న చంద్ర‌బాబుపై ఇప్పుడు త‌మ్మారెడ్డి పిడుగుల్లాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.1453131420-1874

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురికి భార‌త‌ర‌త్న అవార్డులు కేంద్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పేరు లేక‌పోవ‌డంపై బాబుగారు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే.. చంద్ర‌బాబు అసంత‌`ప్తిపై త‌మ్మారెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. ఎందుకంటే.. నాలుగేళ్ల‌పాటు కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న చంద్ర‌బాబుకు ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇప్పించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని.. ఆ నాలుగేళ్ల‌పాటు చ‌డీచ‌ప్పుడు లేకుండా ఉండి.. ఇప్పుడు అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంలో అర్థం లేద‌ని త‌మ్మారెడ్డి చుర‌క‌లు వేశారు.1200px-Tammareddy_Bharadwaja

ఇదంతా చూస్తుంటే.. అస‌లు ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌డం చంద్ర‌బాబుకే ఇష్టం లేదేమోన‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని త‌మ్మారెడ్డి అన్నారు. ఎందుకంటే.. ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇస్తే.. దానికి ఆయ‌న భార్య ల‌క్ష్మీపార్వ‌తి అందుకోవాల్సి ఉంటుంద‌ని, అది చంద్ర‌బాబుకు ఇష్టం లేద‌ని.. అందుకోస‌మే అవార్డుకు అడ్డుప‌డుతున్నారేమోన‌ని భ‌ర‌ద్వాజ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక త‌మ్మారెడ్డిపై త‌మ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మ‌రి.

చంద్ర‌బాబుపై త‌మ్మారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share