నెల్లూరులో టీడీపీకి భారీ షాక్!

October 20, 2018 at 12:26 pm
Tdp cadre to join ycp soon

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ముఖ్యంగా ఎన్నికల ముందు జంపింగ్ రాయుళ్లు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ అవుతారో తమ సన్నిహితులకు కూడా తెలియదు. తాజాగా ఇప్పుడు ఏపిలో టీడీపీ, వైసీసీ, జనసేన మద్య పెద్ద యుద్దమే నడుస్తుంది. ఈ పార్టీల్లో ఎవరు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారో అస్సలు అర్థం కావడం లేదు. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు.

మొన్నటి వరకు టీడీపీ ప్రతిష్ట కోసం పాటు పడతామని..ఏపార్టీలోకి చేరబోమని చెబుతూ వచ్చిన వీరందరూ ఒక్కసారే యూటర్న్ తీసుకోవడంతో అందరూ షాక్ తిన్నారు. అంతే కాదు టీడీపీకి రాజీనామా చేసిన వీరంతా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి మొన్నటి వరకు టీడీపీలో కొనసాగి..ఈ మద్య వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

ఆనంతో పాటు ఎన్‌డీసీసీబీ మాజీ అధ్యక్షుడు వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేటర్‌ రంగమయూరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కుమారుడు సంజీవరెడ్డి వైసీపీలో చేరారు. అంతే కాదు వీరితో పాటు టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

నెల్లూరులో టీడీపీకి భారీ షాక్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share