టీడీపీ `చైన్‌` తెగుతోంది.. రీజ‌న్ ఇదే!

May 17, 2018 at 10:50 am
tdp-ap

వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉన్నాయి. దీనికి మ‌రో 8 మాసాల స‌మ‌యం మాత్రమే ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అన్ని అస్త్ర శ‌స్త్రాల‌తోనూ రంగంలొకి దిగేందుకు  రెడీ అవుతోంది. మ‌రో సారి అధికారం చేజిక్కించుకోవ‌డం ఒక్కటే ఇప్పుడు టీడీపీ టార్గెట్ కాదు. ప‌వ‌న్, జ‌గ‌న్ పార్టీల‌ను పూర్తిగా దెబ్బ‌కోట్ట‌డం కూడా చంద్ర‌బాబు వ్యూహంలో ప్ర‌ధాన అస్త్రం. అయితే, ఆ దిశ‌గా ఎంత‌మేర‌కు స‌క్సెస్ అవుతున్నారు. టీడీపీ ఎంత‌మేర‌కు బ‌లంగా ఉంది. టీడీపీ సైకిల్ ఎంత మేర‌కు స‌న్న‌ద్ధంగా ప‌రిగెట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది? అంటే అనేక ప్ర‌శ్న‌లు వస్తున్నాయి త‌ప్ప‌.. వీటికి స‌మాధానం మాత్రం రావ‌డం లేదు. 

 

అంతేకాదు, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చంద్ర‌బాబు కృషి చేస్తున్నాడు స‌రే.. కానీ, కార్య‌క‌ర్త‌లు, దిగువస్థాయి నేత‌ల్లో ప‌రిస్థితి ఏంటి? అంటే వారి స‌మ‌స్య‌ల్లో వారు ఉన్నార‌ని, వారికి గుర్తింపు లేద‌ని తెగ రోదిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సైకిల్ చైన్ లూజై తెగేందుకు రెడీగా ఉంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాము పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని, ఇప్పుడు కూడా ప‌డుతున్నామ‌ని, అయినా కూడా ఏ మాత్రం గుర్తింపున‌కు నోచుకోవ‌డం లేద‌ని దిగువ‌స్థాయి కార్య‌క‌ర్త‌లు బోరుమంటున్నారు.  

 

పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా..పార్టీ కోసం లక్షల రూపాయల సొంత సొమ్మును ఖర్చుపెట్టి పార్టీని బ‌తికించామ‌ని, అయితే, అదికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు గ‌డుస్తున్నా.. త‌మ‌ను మాత్రం ఎమ్మెల్యేలు.. మంత్రులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని దిగువ శ్రేణి నాయ‌కులు వాపోతున్నారు.  ఎమ్మెల్యేలు, మంత్రులు.. తమకు కావాల్సిన వారినే చేరదీస్తున్నారని.. ఇప్పటికైనా వీరు.. నిజం తెలుసుకుని పదేళ్లు అధికారంలో లేకున్నా.. పార్టీ కోసం కష్టపడి..పనిచేసినవారిని ఆదుకోవాలని సీనియర్‌ కార్యకర్తలు కొందరు చంద్రబాబుకు లేఖ రాసిన‌ట్టు స‌మాచారం. 

 

ఎన్నికలకు ముందు పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి, విపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని నాయ‌కులు మండిప‌డ్డారు. ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని, అయితే, పార్టీ కోసం.. . ఆర్థికపరంగా నష్టపోయిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఘాటుగానే నిప్పులు చెరిగారు నాయ‌కులు.  అటువంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి వారికి ఉన్న అభిలాష తెలుసుకుని.. చేతనైన సహాయం చేస్తే.. వారికి చేయూత ఇచ్చిన వారవుతారని బాబుకు సూచించార‌ట‌.  

 

ఆర్థికంగా దెబ్బతిన్నా..కొనసాగుతున్నామని..తమకు ఏమీ ఇచ్చినా… ఇవ్వకున్నా… పార్టీని అంటిపెట్టుకునే ఉన్నామని.. ఇప్పటికైనా న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పుడు ఈ లేఖ అమ‌రావ‌తి వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డం నాయ‌కులు ఇలా తిరుగు బావుటాకు సిద్ధ‌మ‌య్యేలా ఉత్త‌రాలు రాయ‌డం వంటి ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న‌వారు.. టీడీపీ సైకిల్ చైన్ లూజ‌వుతోంద‌ని, తెగిపోయినా తెగిపోవ‌చ్చ‌ని అంటున్నారు. మరి అప‌ర చాణిక్యుడు వంటి బాబు ఏం చేస్తారో చూడాలి. 

టీడీపీ `చైన్‌` తెగుతోంది.. రీజ‌న్ ఇదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share