టీడీపీలో మొదలైన అంతర్యుద్ధం

March 20, 2019 at 10:15 am

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు అంటూ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చే చంద్ర‌బాబు ఇప్పుడు తీవ్ర ఇర‌కాటంలో ప‌డ్డారు. క్ర‌మ‌శిక్ష‌ణ దేవుడెరుగు ఇప్పుడు పార్టీ ప్ర‌తిష్ట న‌డిరోడ్డున త‌గ‌ల‌బడుతున్నా ఏమీ చేయాలేని నిస్స‌హాయ స్థితిలోకి వెళ్లారు. త‌మ్ముళ్ల మ‌ధ్య వైరం.. ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న లోపం.. ఒక‌రిపై ఒక‌రు నిప్పులు క‌క్కుకుంటున్న తీరుతో చంద్ర‌బాబు ఇప్ప‌టికే తీవ్ర అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు. త‌న నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వాన్ని ఎంత రంగ‌రించినా వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చేట్టు క‌నిపించ‌డం లేదు. రాష్ర్టం మొత్తంగా పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా త‌మ నిర‌స‌న‌లు బ‌హిర్గతం చేస్తూనే ఉన్నారు.

నిన్న‌టికి నిన్న ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి అసెంబ్లీ స్థానాన్ని చంద్ర‌బాబు త‌న బావ‌మ‌రిది బాల‌య్య ఒత్తిడితో క‌దిరి బాబూరావుకు ఇచ్చారు. ఈ విష‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న మంత్రి రాఘ‌వ‌రావు వ‌ర్గం ఆందోళ‌న‌కు దిగింది.. త‌న సిట్టింగ్ స్థానాన్ని త‌న త‌న‌యుడు సుధీర్‌కు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. అధినేత త‌న మాట‌ను ప‌ట్టించుకోక‌పోతే అవ‌స‌ర‌మైతే త‌నూ ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ నుంచి వైదొల‌గుతాన‌ని కూడా హెచ్చ‌రిక‌సైతం చంద్ర‌బాబుకు చేర‌వేశారు. పైగా క‌నిగిరిలో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీలో దిగి తాడోపేడో తేల్చుకుంటాన‌ని కూడా భీష్మించారు.

ఇదే క్ర‌మంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని లింగారెడ్డికి ఇవ్వ‌డాన్ని మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజులురెడ్డి అనుచ‌ర గ‌ణం బీభ‌త్సం స్రుష్టించారు. స్థానిక పార్టీ కార్యాల‌యం ఎదుట టీడీపీ జెండాలు, ఫ్లెక్సీల‌ను త‌గుల‌బెట్టారు. గుంటూరు జిల్లా మాచ‌ర్ల సీటును అంజిరెడ్డికి ఇవ్వ‌డంపై చ‌ల‌మారెడ్డి వ‌ర్గం ఏకంగా ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇంటి ఎదుట ధ‌ర్నాకే దిగారు. వ‌న్ అండ్ ఓన్లీగా వ్య‌వ‌హ‌రించే చంద్ర‌బాబు పార్టీలో ఇలాంటి ప‌రిణామాలు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఒక‌ప్పుడు బాబు ఎదుట నోరుకూడా మెద‌ప‌డానికి భ‌య‌ప‌డే త‌మ్ముళ్లు ఇప్పుడు ఏకంగా రోడ్డుపైకే చేరి నానా హంగామా స్రుష్టిస్తున్నారు. స‌మీపిస్తున్న ఎన్నిక‌ల వేళ టీడీపీకి ఓ వైపు ప్ర‌జ‌ల్లో పూర్తిగా సానుభూతి పోయి అస‌హ్యించుకుంటుంటే, మ‌రోవైపు సీట్ల కేటాయింపులు, అసంత్రుప్తుల ఆందోళ‌న‌లు తీవ్ర గంద‌ర‌గోళంగా మారాయి. మొత్తంగా రాష్ర్టమంతా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం వీస్తుంటే టీడీపీ మాత్రం తీవ్ర గంద‌ర‌గోళంలో ఇరుక్కుని రోజులు లెక్క‌బెడుతోంది.

టీడీపీలో మొదలైన అంతర్యుద్ధం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share