టీడీపీలో ఆ సీటు ఘ‌ట్ట‌మ‌నేని బ్రద‌ర్‌కేనా?

January 10, 2019 at 12:58 pm

పార్టీ ఎందుకు మారారు స్వామీ! అని నేత‌ను అడిగినా త‌డుము కోకుండా చెప్పే స‌మాధానం.. ప‌ద‌వి కోసమ‌నే! ఆ మ‌ధ్య ఏపీలో విప‌క్షం వైసీపీ నుంచి దాదాపు ఇర‌వై ముగ్గురు ఎమ్మెల్యేలు క్యూ క‌ట్టుకుని.. అమెరికా విమానం ఎక్కిన‌ట్టుగా టీడీపీ సైకిల్ ఎక్కేశారు. ఇక‌, వీరిని ఓ మీడియా మిత్రుడు పెన్నుతో క‌లిదిస్తే.. ఒక్కొక్క నాయ‌కుడు వ‌ల్లించిన మాట‌ల మూట‌లు.. అద‌ర‌హో అనిపించాయి. ఒక‌రు బాబు గారి అభివృద్ధి చూసి వ‌చ్చామ‌ని చెబితే.. మ‌రొక‌రు ఈ అభివృద్ధి న‌భూతో.. అందుకే నాభ‌విత కోసం పార్టీ మారి బాబు వేలు ప‌ట్టుకున్నాన‌ని సెల‌విచ్చారు. క‌ట్ చేస్తే.. ఇలా వ‌చ్చిన వారిలో చాలా మంది ప‌ద‌వుల్లో కుదురుకుని ద‌ర్పం వెల‌గ‌బెడుతున్నారు. ఇక‌, ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిగా ఇప్పుడు మ‌ళ్లీ .. క‌లిసిన మీడియా మిత్రుడు మ‌ళ్లీ పాత ప్ర‌శ్నే సంధించాడు!

దీంతో ఈ జంపింగులు చెప్పిం ది.. ఏంటంటే.. బాబు అభివృద్ధిని చూసి మేం వ‌చ్చాం.. మా ప‌రిజ్ఞానం చూసి బాబు ప‌ద‌విచ్చాడ‌ని ముక్తాయిస్తున్నారు. అంటే అభివృద్ధి ఉంద‌ని వీరొస్తే.. వీరి ప‌రిజ్ఞానం చూసి బాబు ప‌ద‌వులిచ్చారే త‌ప్ప‌.. ఈ చాప్ట‌ర్‌లో మ‌రో లెస్స‌నే క‌నిపించ‌లేదు. క‌ట్ చేద్దాం. ఇప్పుడు మ‌రో కీల‌క నాయ‌కుడు.. ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు కూడా జ‌గ‌న్‌కు జ‌ల్ల‌కొట్టి.. జంప్ చేస్తున్నారు. దీనికి రీజ‌న్ ఏంటి? మ‌ళ్లీ అదే ప్ర‌శ్న‌.. అదే ప్ర‌తినిధి! ఆయ‌న మాత్రం మౌనం. దీనికి కూడా రీజ‌న్లుంటాయా? ఓ గ‌ల్లీ లీడ‌ర్ ప్ర‌శ్న‌. ఎందుకు ఉండ‌వు? నాయ‌కులు మౌనంగా ఉన్నారంటే.. అతి పెద్ద రీజ‌నే ఉంటుంద‌ని అర్ధం! అలాగే.. ఆది జంపింగ్ వెనుక కూడా చాలానే స్టోరీ ఉంది. పైకి చెబుతున్న‌ట్టు.. ఆదికి జ‌గ‌న్ గుంటూరులో టికెట్ ఇవ్వ‌లేద‌ని, విజ‌య‌వాడ‌లో టికెట్ ఇస్తాన‌న్నా ఈయ‌న పుచ్చుకోలేద‌ని అంటున్నా.. లో.. లోప‌లి విష‌యం మ‌రోక‌టి ఉంద‌ట‌!

చంద్ర‌బాబుకు ఎలాగూ బంధువే అయిన ఆది.. వైసీపీలో ఉంటే.. నామ‌ర్ధాగా ఉంద‌ని బాబుగారే రెండు మూడు మాసాలుగా ప్ర‌య‌త్నాల‌పై ప్ర‌య‌త్నాలు చేశారు. ఆయ‌నొస్తే..చాలు..! అయ్య‌వారు మ‌నసు మార్చుకుంటే మేలు!! అన్న‌ట్టుగా తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. ఇంకేముంది.. జ‌ర‌గాల్సిన కార్యాన్నిగంధ‌ర్వులు వంటి టీడీపీ నాయ‌కులు వెన‌కుండి జ‌రిపించేశారు. జ‌గ‌న్ నుంచి ఆదిని వేరు చేయ‌డం, బాబుతో ముడిపెట్టేయ‌డం అన్నీ అయిపోయాయి. ఇక‌, పీట‌ల మీద కూర్చోవ‌డ‌మే మిగిలింది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న గుస‌గుస ఏంటంటే. బాబుగారు ఆదికి ఇస్తున్న‌ప‌ద‌వి ఏంటి? అని! థ‌స్‌!! అబివృద్ధి చూసి పార్టీ మారుతున్నారు కాబ‌ట్టి.. అనేవారూఉన్నారు. నిజ‌మే ఇప్ప‌టికే వ‌చ్చినోళ్లు చెప్పిన లెక్క‌లు బ‌ట్టి.. అభివృద్ధి చూసి ఆయ‌నొస్తున్నారు.. ఆయ‌న ప‌రిజ్ఞానం మేరకు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌విక‌ట్ట‌బెడుతున్నారు. కొస‌మెరుపు ఇక్క‌డే ఉంది: ఎమ్మెల్సీ స్థాయి వ్య‌క్తికి.. ఎంపీ సీటుతో ప‌నేంటి? అంటున్నారు రాజ‌కీయ దురంధ‌రులు. దీనిని బ‌ట్టి బాబు బెట‌రా? జ‌గ‌న్ బెట‌రా?! ఇప్పుడు ఇదే స‌మాధానం ల‌భించ‌ని ప్ర‌శ్న‌!

టీడీపీలో ఆ సీటు ఘ‌ట్ట‌మ‌నేని బ్రద‌ర్‌కేనా?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share