ఏక‌మ‌వుతున్న బాబు వ్య‌తిరేక‌శ‌క్తులు

April 16, 2018 at 4:11 pm
chandrababu-

ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారుతున్నాయి. రోజుకో రూపు దాల్చుతున్నాయి. క్ర‌మంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్య‌తిరేక‌శ‌క్తులు ఏక‌మ‌వుతున్నాయి. ఈ పరిణామాల‌న్నీ బాబుగారి చుట్టూ ఏదో జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చెబుతున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని బీజేపీ తేల్చిచెప్పిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో ఇన్నిరోజులూ నాలుగువ‌ర్గాలు ఉన్నాయి. తాజాగా అవికాస్తా మూడుగా మారాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పిలుపుమేర‌కు సోమ‌వారం జ‌రుగుతున్న బంద్‌తో టీడీపీ వ్య‌తిరేక శ‌క్తులు ఏక‌మ‌వుతున్నాయ‌ని తేలిపోయింది. ఇదేస‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి మాట త‌ప్పిన బీజేపీకి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణే లేకుండా పోయింది. 

 

 ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పిలుపునిచ్చిన ఏపీ బంద్‌లో జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌, వైసీపీలు భాగ‌స్వాముల‌య్యాయి. టీడీపీ, బీజేపీలు మాత్రం దూరంగా ఉన్నాయి. ఇక్క‌డే అంద‌రికీ అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి వ్య‌తిరేకంగా ఈ పార్టీల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయ‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. మొద‌ట్లో జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు క‌లిసిక‌ట్టుగా, వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేటిక‌విగా ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో పాల్గొన్నాయి. అయితే ఇందులో క్ర‌మంగా మార్పు వ‌చ్చింది. తాజా బంద్‌తో జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌, వైసీపీలు క‌లిసిన‌డ‌వ‌డం ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామంగా క‌నిపిస్తోంది.

 

కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహాద దీక్ష చేప‌ట్ట‌డం.. ఐదారు రోజుల్లో ఎంపీల ఆరోగ్యం క్షీణించ‌డం.. పోలీసులు దీక్ష‌ను భ‌గ్నం చేసి ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌డం.. ఆ త‌ర్వాత ఏం చేయాలో తెలియ‌క వైసీపీ అయోమ‌యంలో ప‌డిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇన్నిరోజులూ ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ క్రెడిట్ అంతా తానే కొట్టేయాల‌ని చూసిన వైసీపీ త‌ప్ప‌నిస‌రిప‌రిస్థితిలో సాధ‌న స‌మితితో క‌లిసిన‌డుస్తోంది. ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో వ‌చ్చిన ఈ మార్పు రానున్న రోజుల్లో స‌రికొత్త రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని ఆవిష్క‌రిస్తుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

ఇదే స‌మ‌యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ చ‌తుర‌త చాటుతున్నారు. త‌న వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెడుతున్నారు. ఓవైపు త‌న వ్య‌తిరేక శ‌క్తుల్ని ఎదుర్కొంటూనే ఏపీకి ప్ర‌త్యేక‌హోదా సాధించేంద‌కు ఒంట‌రిపోరు చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే ద‌ళిత ప‌రిర‌క్ష‌ణ దినం పేరుతో ఈనెల 20న‌ విజ‌య‌వాడ‌లో స‌భ‌, ఈనెల 30న తిరుప‌తిలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ స‌భ నుంచే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై మ‌రిన్ని ప‌దునైన అస్త్రాలు సంధించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలో తిరుప‌తి వేదికగా మోడీ ఇచ్చిన మాట‌ను త‌ప్పాడ‌న్న విష‌యాన్ని జ‌నంలోకి తీసుకెళ్ల‌డమే ధ్యేయంగా చంద్ర‌బాబు ముందుకువెళ్తున్నారు.

ఏక‌మ‌వుతున్న బాబు వ్య‌తిరేక‌శ‌క్తులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share