టీడీపీ ఆయువుప‌ట్టే.. జ‌గ‌న్ టార్గెట్‌

June 12, 2018 at 12:00 pm

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ వైసీపీ అధినేత జ‌గ‌న్ క‌ల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ధ్యేయంగా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఏమిటా నిర్ణ‌యం అంటే.. ఇక నుంచి ఎమ్మెల్సీ స్థానాల‌న్నీ బీసీవ‌ర్గాల‌కే కేటాయిస్తాన‌నీ ప్ర‌జ‌సంక‌ల్ప‌యాత్ర‌లో ఆయ‌న ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీకి ఆయువుప‌ట్టు అయిన బీసీ వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకునేలా పావులు క‌దుపుతున్నార‌న్న‌విష‌యం స్ప‌ష్ట‌మైంది. వైసీసీ ఓన్లీ ఫ‌ర్ రెడ్డీస్ అన్న ముద్ర‌ను చెరిపివేసుకునేందుకు జ‌గ‌న్ ఇలాంటి ప్ర‌యాత్నాలు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి టీడీపీ ఏర్ప‌డిన నాటి నుంచి ఆ పార్టీకి బీసీలు, అణ‌గారిన వ‌ర్గాలే అండ‌గా ఉంటున్నాయి. 

 

ఈ నేప‌థ్యంలోనే రెడ్డిసామాజిక‌వ‌ర్గం అధిప‌త్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టీడీపీ త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగింది. అదేస‌మ‌యంలో బీసీలు కూడా రాజ‌కీయంగా ఎద‌గ‌డంలో టీడీపీ కీల‌క పాత్ర‌పోషించింది. పశ్చిమ గోదావరి జిల్లా చాగ‌ల్లు మండ‌లం గౌడిప‌ల్లి నుంచి సోమ‌వారం ఉద‌యం జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌ట్టారు. అకిరాస కులం స‌భ్యులు ఏర్పాటు చేసిన క‌`త‌జ్ఞ‌తా స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో బీసీల ప్రాతినిధ్యంపై మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే అకిరాస కులానికి ప్ర‌త్యేక కార్ప‌రేష‌న్ ఏర్పాటు చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. బీసీల స‌మ‌స్య‌ల‌ను చ‌ట్ట‌స‌భ‌ల్లో చ‌ర్చించి న్యాయం చేసేలా కృషి చేస్తాన‌ని ఆయ‌న అన్నారు. 

 

అయితే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు టీడీపీకి కంచుకోట‌లు. ఇక్క‌డ వైసీపీకి అంత‌గాప‌ట్టులేదు. ఈ నేప‌థ్యంలో బీసీవ‌ర్గాల‌ను ఆక‌ర్షించ‌డానికి జ‌గ‌న్ అన్ని ప్ర‌యాత్న‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఎమ్మెల్సీ స్థానాల‌న్నీ బీసీల‌కు, ప్రాతినిధ్యం లేని ఇత‌ర కులాల వారికి ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ట్లు ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

అయితే.. ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీ, టీడీపీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే భ‌గ్గుమంటోంది. అటు వైసీపీ కూడా ఈ విష‌యంలో కేంద్రానికంటే చంద్ర‌బాబునే టార్గెట్ చేసి కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. 

 

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ, జ‌న‌సేన కూడా ప్ర‌జాక్షేత్రంలో చురుగ్గా క‌దులుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ జ‌పిస్తున్న‌బీసీమంత్రంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి కొంత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ కూడా చంద్ర‌బాబుపై గుర్రుగా ఉన్నారు. కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా కొద్దిపాటి తేడానే ఉంటుంది కాబ‌ట్టి ఈ సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను ఎవ‌రు అందిపుచ్చుకుంటార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 

టీడీపీ ఆయువుప‌ట్టే.. జ‌గ‌న్ టార్గెట్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share