టీడీపీకి ఎంపీ అభ్య‌ర్థులు కావ‌లెను..!

March 13, 2019 at 3:08 pm

టీడీపీలో లోక్‌స‌భ‌కు పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు క‌రువ‌య్యారు. నాలుగేళ్లుగా రాష్ర్ట స‌ర్కార్ చేప‌ట్టిన ప్ర‌జావ్య‌తిరేక ప‌నులతో జ‌నం విసిగిపోయి ఉన్నారు. ఎటు చూసిన జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం క‌నిపిస్తోంది. ఆ పార్టీలో చేరికలు కూడా ఆ విష‌యాన్ని నొక్కి వ‌క్కానిస్తున్నాయి. మ‌రోవైపు పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన బాబు అండ్ చిన్న‌బాబు.. రాష్ర్ట జ‌నం స‌మాచారం దొంగిలించి త‌నకు అనుకూల‌మైన వారి చేతిలో పెట్టిన నిర్వాకం మ‌రోటి. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచి ఇష్టారాజ్యంగా ప్ర‌జ‌ల‌ను వాడుకుని, అధికారుల‌ను దూషించి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన తెలివి మాలినత‌నం ఇంకోటి. ఇలా పార్టీ ప్ర‌తిష్ట మొత్తం అధః పాతాళానికి కూరుకుపోయింది.

ఒకేసారి అటు అసెంబ్లీకి, ఇటు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌లు రావ‌డంతో బాబుకు సీట్ల స‌ర్దుబాటులో బాబుకు త‌ల‌ప్రాణం తోక‌కొస్తోంది. జ‌గ‌న్ పార్టీకి రోజురోజుకు ఆద‌ర‌ణ పెరుగుతుండ‌గా జీర్ణించుకోలేక‌పోతున్నాడు. ప్ర‌జాక్షేత్రంలో ఎదిరించి నిల‌బ‌డే క్యాడ‌ర్ కోసం వ‌ల వేసి గాలిస్తున్నాడు.. ప్ర‌తిప‌క్ష నేత సుడిగాలి వంటి ప‌ర్యాట‌న‌కు విలవిల లాడుతున్నాడు. అస‌లు ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బ‌డ‌డానికే వెన‌కాముందు ఆలోచించేస్థాయికి బాబు అండ్ టీం జంకుతున్నారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు వారి ప‌రిస్థితి ఎంత దారుణంలో ఉందోన‌ని.

ఎంపీ సీట్ల కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ఎవ‌రిని క‌దిపినా అసెంబ్లీ బ‌రిలోకే కాస్తో కూస్తో మొగ్గు చూపుతున్నారు త‌ప్ప లోక్‌స‌భకంటేనే ముహం చాటేస్తున్నారు. దాదాపు ప‌ది స్థానాల‌కు అభ్య‌ర్థుల క‌రువు కొట్టొచ్చిన‌ట్టు క‌న‌బ‌డుతుందంటేనే టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో గ‌మ‌నించొచ్చు. పైగా త‌న‌యుడికి అసెంబ్లీ స్థానం కేటాయించ‌డానికి ప‌లువురి **బ‌క్రా**ల‌ను చేస్తున్నాడ‌నే టాక్ కూడా విన‌వ‌స్తోంది. ఇక చేసేదేమీ లేక చంద్ర‌బాబు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో కొత్త‌వారైన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, వంగ‌వీటి రాధ‌, సినీ న‌టుడు శివాజీ, మిస్ట‌ర్ బీన్ ల‌గ‌డ‌పాటి వంటి త‌ట‌స్థుల కోసం కూడా అన్వేష‌ణ షురూ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. చూద్దాం బాబు చ‌క్క‌దిద్దుతాడో లేక జ‌గ‌న్ దెబ్బ‌కు కొట్టుకుపోతాడో..!

టీడీపీకి ఎంపీ అభ్య‌ర్థులు కావ‌లెను..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share