ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి షాక్‌..!

March 21, 2019 at 2:52 pm

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది తెలుగుదేశానికి ఎదురు రాళ్లు త‌గులుతూనే ఉన్నాయి.. సీట్ల పంప‌కం ద‌గ్గ‌ర మొద‌లైన అల‌జ‌డి రోజురోజుకు పెరుగుతూ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒక‌ప్పుడు చంద్ర‌బాబుకు ఎదురు చెప్ప‌డానికే భ‌య‌ప‌డే త‌మ్ముళ్లు ఇప్పుడు మొహం మీద‌నే ముక్కుసూటిగా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు అసంత్రుప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారు. పార్టీ ప‌రిస్థితి దిన‌దినం గండంగా మారుతోంది.. ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వ‌డం ఒక కార‌ణ‌మైతే.. దానికి కారకుడు ముమ్మాటికి చంద్ర‌బాబు విధానాలే అంటూ శ్రేణులు మండిప‌డుతున్నారు. జ‌నాల్లోకి అభివ్రుద్ధిని చెప్పుకుని వెళ్లాలి కానీ లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తే మొద‌టికే మోసం జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

ఇప్ప‌టికే అనంత‌పురం, చిత్తూరు, ప‌శ్చిమ గోదావ‌రి, క‌డ‌ప మొద‌ల‌గు జిల్లాల్లో పార్టీపై అసంత్రుప్తుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. జేసీ బ్ర‌ద‌ర్స్ ఆగ్ర‌హం, ప‌రిటాల అల‌క‌లు, డీఎల్ ర‌వీంద్ర, నామా నాగేశ్వ‌ర్ రావ‌వు ఎగ‌నామాలు ఇలా సీనియ‌ర్ మోస్ట్‌లు అంతా పార్టీని వీడి వైసీపీలోకి చేరారు. ఇప్పుడు అదే బాట‌లో ప్ర‌కాశం జిల్లా లో కూడా ఈద‌ర హ‌రిబాబు రూపంలో మ‌రో షాక్ త‌గ‌ల‌బోతోంది.. టీడీపీ నేత వ్య‌వ‌హారం త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని, విధానాలు స‌క్ర‌మంగా లేక ప్ర‌జ‌ల్లోకి వెళ్తే ప‌రాభ‌వం త‌ప్ప మిగిలేది ఏమీ ఉండ‌ద‌ని హ‌రిబాబు పేర్కొంటున్నారు.

పొన్న‌లూరు నుంచి తెలుగుదేశం నుంచి జ‌డ్పీటీసీగా గెలుపొందిన హ‌రిబాబు ఇప్పుడు చంద్ర‌బాబుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీలో త‌న‌కు స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని తీవ్రంగా అవ‌మానిస్తున్నార‌ని పేర్కొంటున్నారు. విద్యారంగానికే అధిక ప్రాధాన్య‌త, విద్యా రంగంలో సంస్క‌ర‌ణ‌లు తెచ్చే పార్టీలోకి వెళ్తాన‌ని ప‌రోక్షంగా ఏ పార్టీలోకి వెళ్ల‌నున్నాడో అనే విష‌యాన్ని తేల్చేశారు. మ‌రో ఇర‌వై రోజుల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నుండ‌గా, రాష్ర్టం మొత్తం పార్టీపై తీవ్ర విద్వేశాలు నెల‌కొన‌డంతో గెలుపు గుర్రాలు అందే అవ‌కాశాలు చాలా క‌ష్ట‌మ‌ని చెప్పారు. రెండు మూడు రోజుల్లో త‌న అనుచ‌రుల‌తో మాట్లాడి ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణ‌యించుకుంటాన‌ని వివ‌రించారు. కాగా, ఎన్నిక‌ల వేళ పార్టీకి ఆయువు ప‌ట్టుగా ఉన్న ఒక్కో నేత దూర‌మ‌వ‌డం ఇప్పుడు చంద్ర‌బాబుకు కంటిమీద కునుకుప‌డ‌కుండా చేస్తోంది.

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి షాక్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share