ఆ సామాజిక వ‌ర్గాన్ని టీడీపీ దూరం చేసుకుందా…!

December 15, 2018 at 4:57 pm

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. నేత‌లు ఒక‌టి త‌లిస్తే.. ప్ర‌జ‌లు మ‌రొక విధంగా ఆలోచిస్తూ ఉంటారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేస్తున్నాన‌ని ప‌దే ప‌దే సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు అయితే, శ్రీకాకుళంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న క‌ళింగ వైశ్యులు మాత్రం త‌మ‌ను టీడీపీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటు న్నారు. తాజాగా ఇదే విష‌యాన్ని టార్గెట్ చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈ సామాజిక వ‌ర్గం ఓట్ల‌కు గేలం వేశారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 32% మంది ఉన్నార‌ని అంటున్న క‌ళింగ వైశ్యుల సంక్షేమానికి తాము ముందుకు వ‌స్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో కళింగ వైశ్యులకు శాసన సభలో ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం కల్పిస్తామని, లేనిపక్షంలో ఎమ్మెల్సీగానైనా ఎంపిక చేస్తామని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీనిపై ఆ వ‌ర్గం నేత‌ల్లో హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. జగన్‌ ప్రకటనతో కళింగ వైశ్యుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. ప్రస్తుతం కళింగ వైశ్యుల కార్పొరేషన్‌ ద్వారా అందుతున్న రుణాలను రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు. దీంతో కళింగ వైశ్య యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాతాయనేది సందేహం లేని విష‌యంగా మారింది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి సామాజిక వ‌ర్గానికీ కూడా టీడీపీ అంతో ఇంతో చేస్తోంది.

అయితే, అదేస‌మ‌యంలో అందుతున్న ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. క్షేత్ర‌స్థాయికి వ‌చ్చే స‌రికి మాత్రం అన్ని సామాజిక వ‌ర్గాల‌కూ అందుతున్న‌ది కొంతే అనే భావ‌న భారీగా ఉంది. దీనిని గ‌మ‌నించ‌కుండానే చంద్ర‌బాబు కానీ, ఇత‌ర నేత‌లు కానీ.. త‌మ‌కు ఏదో అన్ని సామాజిక వ‌ర్గాల అండ ఉంద‌నీ చెప్పుకొంటున్నారు. తాజాగా శ్రీకాకుళంలో ఎదురైన అనుభ‌వా లను చూస్తే.. క‌ళింగ వైశ్యుల ప‌రిస్థితి అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌మ‌కు కేటాయించిన నిధులు కూడా త‌మ‌కు స‌క్ర‌మంగా అంద‌డం లేద‌ని ఈ వ‌ర్గం వారుతీవ్రంగా ఆరోపిస్తున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రింత పెరిగితే.. ఇబ్బందులు త‌ప్ప‌వుగా! అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

ఆ సామాజిక వ‌ర్గాన్ని టీడీపీ దూరం చేసుకుందా…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share