త‌మ్ముళ్ల చందాల దందా..! చందా ఇస్తావా.. చ‌స్తావా..!?

February 27, 2019 at 5:33 pm

చందాల దందా షురువైంది.. ఎన్నిక‌ల వేళ ఇదో అతి ముఖ్య కార్య‌క్ర‌మంగా మార‌బోతోంది.. కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు ఇప్ప‌టికే అస్ర్త‌శ‌స్ర్తాల‌ను సిద్ధం చేసుకున్నారు.. ఎన్నిక‌ల పేరు చెప్పి వసూళ్లు చేయ‌డంపై ద్రుష్టిపెట్టారు.. వంద‌లు కాదు వేలు కాదు లక్ష‌ల్లో లాగే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.. ప్ర‌య‌త్నం చేయ‌డం కాదు ఏకంగా హుకూం జారీ చేస్తున్నారు.. ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు ఇవ్వండ‌ని స్థాయిని బ‌ట్టి లాగేందుకు ఆంక్ష‌లు విధిస్తున్నారు.. క‌చ్చితంగా ఇవ్వాల్సిందేన‌ని, లేక‌పోతే విప‌రీత ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిక‌లు సైతం జారీ చేస్తున్నారు..

తాజాగా గుంటూరు జిల్లాలోని ఓ నేత త‌న‌యుడు బ‌డా వ్యాపారులు, భూస్వాములు, పారిశ్రామిక వేత్త‌లు, కాంట్రాక్ట‌ర్ల‌పై ఒత్తిడి పెంచుతున్నాడు.. వాళ్లు ఏ ప‌ని చేయాల‌న్నా ప‌ర్సంటేజీ ఇవ్వాల్సిందే.. లేకుంటే ప‌నులు జ‌ర‌గ‌వు, ఇది వ‌ర‌కే జ‌రిగిన ప‌నులను కూడా నాశ‌నం చేయ‌డం జ‌రుగుతూనే ఉంటుంది. స‌ద‌రు నేత పుత్ర‌ర‌త్నం గురించి ఓ రైల్వే కాంట్రాక్ట‌ర్ కూడా పార్టీ అధినేత ద్రుష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు మాత్రం శూన్యం. అత‌గాడి పరిస్థితి ఎలా ఉందంటే అదేదో సినిమాలో పెళ్లి తంతు పూర్తి అయ్యాక చ‌దివింపు కార్య‌క్ర‌మం త‌ప్ప‌కుండా త‌లా నూట ప‌ద‌హార్లు చేయాల్సిందే అని హీరో గారు కండిష‌న్ పెట్టిన‌ట్టుగా ఉంది.. త‌న మామ‌కుఇవ్వ‌డాన‌కి క‌ట్నం డ‌బ్బుల‌ను వ‌చ్చే అతిథుల నుంచి వ‌సూలు చేయ‌డానికి చేసిన ప్లాన్‌లాగ ఉంది..

అయినా ఎన్నిక‌ల కోలాహ‌లంలో ఎన్నిజిమ్మిక్కులు జ‌ర‌గుతాయో తెలియంది కాదు.. **ఎంకి పెళ్లి సుబ్బి చావుకు** వ‌చ్చిన చందంగా సాధార‌ణ ఎన్నిక‌లేమో గానీ చందాలంటూ త‌మ‌ను ఊసూరు మ‌నిపిస్తున్నార‌ని వ్యాపారులు, కాంట్రాక్ట‌ర్లు వాపోతున్నారు. త‌మ‌కు ఈ చందాల దందా నుంచి విముక్తులు క‌ల్పించాల‌ని, స‌ద‌రు త‌మ్ముళ్ల బాగోతం చంద్ర‌బాబు ఆదిలోనే అడ్డుక‌ట్ట వేయాల‌ని లేక‌పోతే మితిమీరిపోయి ఎంత‌కైనా తెగించే ప‌రిస్తితి ఉంటుంద‌ని వాపోతున్నారు. ఏది ఏమైనా ఎవ‌డి కార్యానికో ఎవ‌డో చ‌దివింపులు చేసుకోవ‌డం విడ్డూరం కాక‌పోతే మ‌రేంటి అని విశ్లేష‌కులు అంటున్నారు. స్వ‌చ్ఛందంగా చందాలు ఇస్తే కాద‌నే వారు ఎవ‌రూ ఉండ‌రు. కానీ బ‌ల‌వంతంపు వ‌సూళ్లే ఇబ్బంది క‌ర‌మ‌ని పేర్కొంటున్నారు. బాబు గారు జ‌ర ఆ బ‌రితెగించిన త‌న‌యుల చందా బాగోతం కాస్త మీరైనా చూడండి.. లేక మీ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగితే బాధితుల‌ను కాపాడే వాడు ఉండ‌డు.. వాళ్ల క‌ర్మ వాళ్లు అనుభ‌విస్త‌రు మ‌రి చేస్త‌రు చెప్పండి.

త‌మ్ముళ్ల చందాల దందా..! చందా ఇస్తావా.. చ‌స్తావా..!?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share