భయం గుప్పేట్లో అధికార నేతలు !

November 1, 2018 at 10:26 am
2222222222

ఏపీ అధికార పార్టీ నేత‌ల‌కు నిద్ర క‌రువ‌వుతోంది! ఎన్నిక‌ల‌కు మ‌రో ఆరు మాసాలే స‌మ‌యం ఉండ‌డంతో నాయకులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఎప్పుడు ఎవ‌రు త‌మ సీటు ఎస‌రు పెడ‌తారోన‌ని సిట్టింగులు మ‌రింత భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతున్నారు. ఇప్ప‌టికే ఒక్కొక్క ఎమ్మెల్యేపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు 10కి పైగా స‌ర్వే లు చేయించారు. ఈ స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఆధారంగా చంద్ర‌బాబు టికెట్ల‌ను కేటాయించ‌డం ఖాయ‌మ‌ని తెలిసిన విష‌య‌మే. ఈ నేప‌థ్యంలో ఒకింత మంచి మార్కులు వ‌చ్చిన ఎమ్మెల్యేలు ఫ‌ర్వాలేదులే.. టికెట్ ఖాయ‌మ‌ని అనుకుంటున్నా.. తాజా ప‌రిణామాలు, విపక్షం వైసీపీ తీసుకునే నిర్ణ‌యాలు కూడా వీరిపై ప్ర‌భావం చూపిస్తున్నాయి. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ఎన్నారైల‌ను రంగంలోకి దింపుతున్నారు. chandrababu-mahanadu-692-28-1464419122

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అక్క‌డున్న సిట్టింగ్ టీడీపీ నాయ‌కులు.. చంద్ర‌బాబు ఈ విష‌యాన్నిఆస‌రా చేసుకుని గెలుపు గుర్రాల‌కే టికెట్ ఇవ్వాల‌ని భావిస్తే.. త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు కుమిలిపోతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం వున్న సిట్టింగ్‌ల్లో కొందరికి మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చని ఈ మధ్యన ప్రచారం ఊపందుకుంది. పార్టీ అంతర్గత వేదికల్లోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. ఒకవేళ సీఎం చంద్రబాబు మనసులో ఏముంది..? తమకు సీటును కొనసాగిస్తారా ? లేదంటే కొత్త వారిని తెరపైకి తెస్తారా ? అనే సవాలక్ష సందేహాలతో ఎమ్మెల్యేలు కొందరు కుదురుగా ఉండలేకపోతున్నారు. అయితే, అధిష్టానాన్ని ఈ విషయంపై ప్రశ్నించలేకపోతున్నారు. 4183_AP_CM

తమకున్న శక్తియుక్తులను ఉపయోగించి, పార్టీలో తమ శ్రేయోభిలాషులు, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకుల నుంచి అసలు పరిస్థితి ఆరా తీసే పనిలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో నాలుగేళ్లుగా క్షణం తీరిక లేకుండా గడిపామని, నియోజకవర్గ స్థాయిలో భేదాభిప్రాయాలు తలెత్తకుం డా, రెండో పవర్‌ పాయింట్‌కు స్థానం లేకుండా ఏకపక్షంగా తాము తీసుకున్న నిర్ణయాలు సక్సెస్‌ అయ్యాయే తప్ప.. ఎలాంటి అసంతృప్తికి గురి చేయలేదనేది ఎమ్మెల్యేల వాదన.

ఇప్పటికే ఎంపీల విషయంలో కుండబద్దలు కొట్టినట్టు సీఎం చంద్రబాబు మనసులో ఏముందో కొంతలో కొంత బయటపడిందని, ఎమ్మెల్యేల విషయంలో గుంభనంగా ఉం డడంతో తమ భవిష్యత్తుపై పూర్తిస్థాయి ధీమాతో తాము ఉండలేకపోతున్నామని కొందరు ఎమ్మెల్యేలు తమ సహచరుల వద్ద వాపోతున్నారు. కనీసం రెండు, మూడుచోట్ల ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పోటీగా కొత్తముఖాలు రంగంలోకి దిగ డం, వీరంతా సీఎం చంద్రబాబు, పంచాయతీరాజ్‌ మంత్రి లోకేష్‌తో తామంతా ‘టచ్‌’లో ఉన్నట్టు నియోజకవర్గాల్లో చేస్తు న్న ప్రచారం సరికొత్త ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని సిట్టింగులు చింతిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

భయం గుప్పేట్లో అధికార నేతలు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share