ఎమ్మెల్యే టికెట్ కోసం మేయ‌ర్ ర‌గ‌డ‌.. ఎక్క‌డ‌..?

July 5, 2018 at 9:04 am
TDP-VIJayawada

రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతం.. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ అధీనంలో ఉంది. ఇక్క‌డ క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన వారు భారీ సంఖ్య‌లో ఉన్నారు. అదేవిధంగా ఈప్రాంతం అంతా.. అతిపెద్ద వాణిజ్య స‌ముదాయం. పెద్ద పెద్ద హోట‌ళ్లు, భ‌వంతులు, జ్యుయ‌ల‌రీ షాపులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు వంటి కీల‌క‌మైనవ‌న్నీ ఇక్క‌డే ఉన్నాయి. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం స‌హ‌జంగానే రోజూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక్క‌డ 2014లో టీడీపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిన గ‌ద్దె రామ్మోహ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. సౌమ్యుడు, నిదాన‌స్తులు, క‌లుపుగోలు గ‌ల నేత‌గా ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే కాకుండా పార్టీలోనూ గుర్తింపు పొందారు. 

 

పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద కూడా మంచి మార్కులే ఉన్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో దాదాపు ఈయ‌న‌నే ఇక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని పార్టీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యించింది. అయితే, విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌గా ఉన్న ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కోనేరు శ్రీధ‌ర్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈటికెట్ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ విష‌యంపై ఎమ్మెల్యే వ‌ర్సెస్ మేయ‌ర్ అన్న‌చందంగా రోజూ ఏదో ఒక ఘ‌ర్ష‌ణ త‌లెత్తుతోంది. నిత్యం సీఎం వ‌చ్చిపోయే నియోజ‌క‌వ‌ర్గం, ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు ఎక్కువ శాతం జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ ఏం జ‌రిగినా మీడియాకు వెంట‌నే పాకిపోతుంది. ఇక‌, ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. 

 

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో విభేదాలు మరింత జఠిలంగా తయారయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో తూర్పు సీటు తనకే కేటాయిం చాలంటూ కోనేరు ఆ పార్టీ పెద్దలను కలుస్తూ, ముఖ్యనేతల ద్వారా పావులు కదుపుతున్న వైనం గద్దెకు మరింత కోపం తెప్పిస్తోంది. ఇప్పటికే తన వివాదాస్పద వ్యాఖ్యలతో  వీఎంసీలో మేయర్‌ కోనేరు శ్రీధర్‌ ఒంటరయ్యారనే చెప్పాలి. కోనేరు వ్యవహార శైలిపై గుర్రుమంటున్న పాలకపక్ష కార్పొరేటర్లు కూడా దూరమయ్యారు. తనతో సన్నిహితంగా మెలిగే కార్పొరేటర్లు కూడా మేయర్‌ శైలితో విసిగిపోయి ఆయనకు దూరంగా ఉంటున్నారు. మేయర్‌ అధికారాలపై కత్తెర వేయడం, కమిషనర్‌కు నిధులు మంజూరు అధికారం పెంచడం లాంటి పరిణామాల నేపథ్యంలో కోనేరును పట్టించుకొనే వారు కరువయ్యారు. 

 

తోటి కార్పొరేటర్లు కలసి రాకపోవడంతో  నాలుగేళ్లు పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకోలేని దుస్థితి కూడా నెలకొంది. ఇదిలావుంటే, తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో తానూ ఉన్నానని, ముఖ్యమంత్రి తనకు సీటిస్తారని ఆశిస్తున్నానని,  స్థానికేతరులను తీసుకువచ్చి తమ తలపై రుద్దితే ఒప్పుకునేదిలేదని పరోక్షంగా మేయర్‌ కోనేరు శ్రీధర్‌ తూర్పు ఎమ్మెల్యే గద్దెపై అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఇటు గద్దె, మేయర్‌ల మ‌ధ్య ఉన్న వివాదం మరింత దుమారం రేగుతోంది. మ‌రి చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఎమ్మెల్యే టికెట్ కోసం మేయ‌ర్ ర‌గ‌డ‌.. ఎక్క‌డ‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share