కోపంతో మ‌హానాడు నుంచి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్యే

May 22, 2018 at 11:03 am
TDP-Telangana

టీడీపీకి పెద్ద పండ‌గ లాంటి కార్య‌క్ర‌మం అయిన మ‌హానాడు సాక్షిగానే ఓ టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర‌మైన అవ‌మానం ఎదురైంది. దీంతో ఆ ఎమ్మెల్యే ఒక్క‌సారిగా మ‌హానాడు జ‌రుగుతోన్న వేదిక నుంచి వెంట‌నే నిష్క్ర‌మించారు. తెలంగాణ‌లో టీడీపీకి మిగిలిన ఒకే ఒక ఎమ్మెల్యే స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌. తాజాగా పార్టీకి కాస్తో కూస్తో ప‌ట్టున్న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో జిల్లా మ‌హానాడు జిల్లా కేంద్ర‌మైన ఖ‌మ్మంలో జ‌రిగింది. ఈ  మినీ మహానాడుకు ఇరు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. 

 

జిల్లా కేంద్రంగా ఉన్న ఖ‌మ్మంలో కొన్ని డివిజ‌న్ల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు ఖ‌మ్మం న‌గ‌ర క‌మిటీని ఎందుకు వేయ‌లేద‌ని వాగ్వివాదానికి దిగారు. ఖమ్మం నగర కమిటీని తేల్చేంత వరకు వెళ్లేది లేదంటూ నానా హడావిడి చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య న‌గ‌ర పార్టీ నాయ‌కుల‌తో మాట్లాడారు. ‘మూడేళ్లు కావస్తున్నా నగర కమిటీ వేయరా…? ఎందుకు వేయరు..? అని ప్రశ్నించారు. విషయాన్ని నామానాగేశ్వరరావుకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో మినీమహానాడు పూర్తయిన తర్వాత కమిటీ వేద్దామ‌ని ముందుగా మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మానికి రావాల‌ని ఆయ‌న స‌ర్ది చెప్పారు.

 

న‌గ‌ర క‌మిటీ విష‌యంలో రాద్దాంతం చేసిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. కార్య‌క్ర‌మం ముగిశాక కూడా నామా నాగేశ్వ‌ర‌రావు క‌మిటీ గురించి ప్ర‌స్తావించ‌కుండా వేదిక దిగి వెళ్లిపోయారు. దీంతో మ‌ళ్లీ వాళ్లు న‌గ‌ర క‌మిటీ అంశాన్ని ప్ర‌స్తావించారు. పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్యే సండ్ర‌తో పాటు పాలేరు టీడీపీ ఇన్‌చార్జ్ మ‌ద్దినేని బేబి స్వ‌ర్ణ‌కుమారి మాట్లాడుతున్నారు. కార్య‌క‌ర్త‌ల్లో కొంద‌రు సండ్ర‌ను హేళ‌న చేసేలా మాట్లాడారు.

 

త‌న‌ను అవ‌హేళ‌న చేసేలా మాట్లాడ‌డంతో తీవ్రంగా నొచ్చుకున్న సండ్ర వెంట‌నే మినీ మ‌హానాడు వేదిక మీద నుంచి కింద‌కు దిగేసి వెళ్లిపోయారు. ఆయ‌న్ను ఆపేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించినా ఆయ‌న మాత్రం విసురుగా వెళ్లిపోయారు. ఏదేమైనా తెలంగాణ‌లో టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే సండ్ర. ఇప్పుడు పార్టీకి కాస్తో కూస్తో ప‌ట్టున్న ఖ‌మ్మం జిల్లాలోనే ఇలాంటి గొడ‌వ‌లు ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ అస‌లు ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఉనికిని నిలుపుకునే ప‌రిస్థితి లేదు.

కోపంతో మ‌హానాడు నుంచి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share