బాబుకు ఝలక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

February 5, 2019 at 12:14 pm

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగ‌వంతంగా మారుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ స‌మీక‌ర‌ణాల‌న్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉండ‌డంతో ఇత‌ర పార్టీల నుంచి ప‌లువురు నాయ‌కులు వ‌చ్చి చేరేందుకు క్యూ క‌డుతున్నారు. ఇందులో భాగంగానే..తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి క‌`ష్ణ‌మోహ‌న్ వైసీపీలోకి వ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఆయ‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

చీరాల ఎమ్మెల్యే ఆమంచి క‌`ష్ణ‌మోహ‌న్ వైసీపీలోకి వెళ్తే ప్ర‌కాశం జిల్లాలో కీల‌క ప‌రిణామాలు ఉంటాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే పందిళ్ల‌ప‌ల్లిలోని త‌న నివాసంలో ముఖ్య అనుచ‌రుల‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ మార‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. నిజానికి 2014 ఎన్నిక‌ల్లో చీరాల నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఆమంచి క‌`ష్ణ‌మోహ‌న్ గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరారు. కానీ.. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పూర్తిగా విఫ‌లం చెంద‌డంతో ఆమంచి తీవ్ర అసంత‌`ప్తితో ఉన్నారు.

ఇదే స‌మ‌యంలో దిగ్విజ‌యంగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌ను పూర్తి చేసిన జ‌గ‌న్ వైపు జ‌నం ఉండ‌డం.. ఏపీకి ప్ర‌త్యేక కేవ‌లం జ‌గ‌న్‌తోనే సాధ్యం అవుతుంద‌ని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు న‌మ్ముతున్న నేప‌థ్యంలో ఆమంచి వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. ఈ ప‌రిణామాలు అధికార టీడీపీకి భారీ షాకేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే ప్ర‌కాశం జిల్లాలో కీల‌క నేత‌లు వైసీపీలోకి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర్‌రావు త‌న కుమారుడిని వైసీపీలో చేర్పిస్తున్నారు.

బాబుకు ఝలక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share