రాత్రి 10 అయితే కాంగ్రెస్ పార్టీలో ఏం జ‌రుగుతోంది….

April 12, 2018 at 10:43 am
ts-congress

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్‌లో ఉంది. ఇటీవ‌ల చేప‌ట్టిన ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తుండ‌డంతో ఆ పార్టీ నేత‌లు నూత‌నోత్సాహంతో ఉన్నారు. రెండు విడుత‌లుగా చేప‌ట్టిన బ‌స్సు యాత్ర‌ల‌తో కాంగ్రెస్ శ్రేణుల్లో నూత‌నోత్తేజం క‌నిపిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన స‌భ‌లకు ఊహించిన‌దానికంటే ఎక్కువ జ‌నం రావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌న్న‌ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు. అయితే ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా.. కొద్దిరోజులుగా కాంగ్రెస్ నాయ‌కుల‌ను ఓ భ‌యం వెంటాడుతోంది. 

 

తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌లు రాత్రి ప‌దిదాటిందంటే వ‌ణికిపోతున్నార‌ట‌.. ఎప్పుడు ఫోన్ వ‌స్తుందోన‌ని తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఇటీవ‌ల రాత్రి ప‌దిగంట‌ల త‌ర్వాత ప‌లువురు నాయ‌కుల‌కు ఫోన్ చేస్తున్నారట‌. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌నీ, ఎవ‌రూ లూజ్ టాక్ చేయ‌వ‌ద్ద‌నీ, క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని త‌న‌దైన శైలిలో హెచ్చ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో ప‌లువురు నాయ‌కులు మాట్ల‌డడానికే భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఎన్నిక‌ల ముంగిట వివాదాల‌కు దూరంగా ఉండ‌డం అన్నివిధాలా మంచిద‌ని భావిస్తున్నార‌ట‌.

 

ఇటీవ‌ల ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ నేత చిత్త‌రంజ‌న్‌దాస్‌కు రాత్రి ప‌దిగంట‌ల త‌ర్వాత ఉత్త‌మ్ ఫోన్ చేసిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీసీల‌కు 40 సీట్లు కేటాయించాల‌ని కొద్దిరోజుల కింద‌ట చిత్త‌రంజ‌న్‌దాస్ అన్నారు. దీనిపై ఉత్త‌మ్ ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఎన్నిక‌ల ముంగిట ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌నీ గ‌ట్టిగా చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే చిత్త‌రంజ‌న్‌దాస్ కూడా ఉత్త‌మ్‌కు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

 

అదే విధంగా న‌ల్ల‌గొండ‌కు చెందిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి కూడా ఉత్త‌మ్ ఫోన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇలా రాత్రి ప‌దిగంట‌ల త‌ర్వాత లూజ్ టాక్ చేసిన నాయ‌కుల‌పై ఉత్త‌మ్ ఫోన్ చేసి, క్లాస్ తీసుకుంటుండంతో ఇప్పుడు ఈ విష‌యం పార్టీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

రాత్రి 10 అయితే కాంగ్రెస్ పార్టీలో ఏం జ‌రుగుతోంది….
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share