విజయాలు అక్కర్లేదు, సీట్లే కావాలి!

November 10, 2018 at 10:54 pm

మహా కూటమి లో పొత్తులు ఖరారు అయినప్పటికీ, సీట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేటప్పటికి, భాగస్వామ్య పార్టీ ల నడుమ లొల్లి నడుస్తూనేవుంది. తెలుగు దేశం, తెలంగాణ జన సమితి పార్టీల కన్నా, సిపిఐ పార్టీ లోనే ఈ సీట్ల కేటాయింపు ముదిరి పాకాన పడి, ఆ పార్టీని నిలువునా ముంచే లాగా పరిస్ధితులు మారుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తాను పోటీ చేయదలచుకున్న హుస్నాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా ప్రవీణ్ రెడ్డి ప్రచారంలో దూసుకు పోతూ ఉండటంతో కలవరపాటుకు గురి అవుతున్నారు. మరో సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు గతంలో తాను ప్రాతనిధ్యం వహించిన కొత్తగూడెం సీటు కోసం కూటమి లోని అన్ని పార్టీలతో పోరు కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం సీటు పై కూటమి లోని అన్ని పార్టీలు కన్నేయడంతో ఈ సీటు పై పీఠముడి కొనసాగుతూవుంది. తాజాగా కూనంనేని తనకు కొత్తగూడెం సీటు దక్కకపోతే తను దేనికైనా సిద్దమనే సంకేతాలు పార్టీకి, కూటమి కి పంపుతుండటం మహాకూటమిని కలవరపరుస్తోంది.States-Oct1-5

సిద్దాంతాల విలువలు కలిగి, క్రమశిక్షణ కు మారుపేరుగా చెప్పుకునే కమ్యూనిష్ట్ పార్టీలు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చి, సీటు కోసం సిగపట్లు పట్టడం, పార్టీ నిర్ణయాలను ధిక్కరించడం చూస్తే రాజకీయ విలువలు పతనమవుతున్నాయనిTelangana-Mahakutami-Seat-Distribution-Socialpost

భావించక తప్పదు. చివరకు తెలంగాణ జన సమితి కూడా సిపిఐ కంటే ఎక్కువ సీట్ల కోసం కాంగ్రెస్ తో పోరాడుతుంటే సిపిఐ మాత్రం తమ పార్టీ లో ఉన్న అగ్ర నాయకులు, మాజీ ఎంఎల్ఎ లకు కూడా సీట్లు తెచ్చుకోలేని స్థితి లోఉందని అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలు మాటలు నిజమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

విజయాలు అక్కర్లేదు, సీట్లే కావాలి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share