మ‌హాకూట‌మిలో సీట్ల గ‌లాట‌.. ఎందుకో తెలుసా..?

September 18, 2018 at 6:22 pm

తెలంగాణ‌లో రాజ‌కీయాలు రంజుగా మారుతున్నాయి. ఒక్క‌రోజులోనే.. అందులోనూ ఒక‌టిరెండు గంట‌ల్లోనే రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చేసి.. ప్ర‌తిప‌క్షాల‌కు చుక్క‌లు చూపించిన కేసీఆర్‌.. ప్ర‌చారంలోనూ దూసుకుపోతున్నారు. ఇలా అసెంబ్లీని ర‌ద్దు.. అలా ఏకంగా 105మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌ను ఊహించ‌ని దెబ్బ‌కొట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్త‌`తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. పార్టీ చేప‌ట్టిన అభివ‌`ద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు ఇంకా ఆ దిశ‌గా రెండ‌డుగులు కూడా ముందుకు వేయ‌లేదు. అధికార టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీ మ‌హాకూట‌మి ఏర్పాటు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ టీడీపీ, తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐల‌తో మ‌హా కూట‌మి ఏర్పాటు చేయాల‌ని చూస్తోంది. ఈ మేర‌కు ఆ పార్టీల నేత‌ల మ‌ధ్య ఓ అవ‌గాహ‌న కూడా కుదిరింది. కానీ.. ఆదిలోనే మ‌హాకూట‌మిలో సీట్ల గ‌లాట మొద‌లైంది. సీట్ల స‌ర్దుబాటు ఇంకా ఖ‌రారు కాలేదు. ఇది ఇప్ప‌ట్లో అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ఇందులో ప్ర‌ధానంగా టీడీపీ, తెలంగాణ జ‌న స‌మితి పార్టీలు ఎక్కువ సీట్లు కోరుతుండ‌డంతో కాంగ్రెస్ నేత‌లు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జ‌న స‌మితి అధినేత కోదండ‌రాం పెడుతున్న మెలిక‌తో కాంగ్రెస్ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. మ‌హా కూట‌మికి కామ‌న్ మ్యానిఫెస్టో ఉండాల‌ని, దానికి తానే చైర్మ‌న్‌గా ఉండాల‌నే డిమాండ్‌ను కోదండ‌రాం ముందుకు తెస్తున్నార‌ట‌. దీంతో ఏం చేయాలో తెలియ‌క కాంగ్రెస్ పెద్ద‌లు గంద‌ర‌గోళంలో ప‌డిపోతున్నార‌ట‌.Telangana-COngress-Party-on-About-Seat-Sharing-With-TDP-and-TJS--And-CPI-1537268012-1886

ఇక ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల‌తో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌తో భేటీ అయి.. పొత్తులు, సీట్ల స‌ర్దుబాటుపై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇక్క‌డ రాహుల్ ఓ కండిష‌న్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ క‌చ్చితంగా గెలిచే సీట్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇత‌రుల‌కు కేటాయించ‌వ‌ద్ద‌ని గ‌ట్టిగా చెప్పిన‌ట్లు స‌మాచారం. టీడీపీ, తెలంగాణ జ‌న స‌మితి పెడుతున్న కండిష‌న్ల‌తో సీట్ల స‌ర్దుబాటు విష‌యం ఇప్ప‌ట్లో ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నేత చాడ వెంక‌ట్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ‌, టీజీఎస్ నేత కోదండ‌రాంలు మ‌ళ్లీ భేటీ అవుతార‌నే టాక్ వినిపిస్తోంది. ఇందులో క్లారిటీ రాకుంటే మాత్రం ఆయా పార్టీల‌కు తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌హాకూట‌మిలో సీట్ల గ‌లాట‌.. ఎందుకో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share