తెలంగాణాలో ఓటరు జోరు ..రికార్డు స్థాయిలో పోలింగ్

December 7, 2018 at 1:23 pm

తెలంగాణ‌లో పోలింగ్ కేంద్రాల ఎదుట ఓట‌ర్లు బారులు తీరుతున్నారు. యువ‌త దగ్గ‌ర నుంచి వ‌`ద్ధుల వ‌ర‌కు అన్ని వ‌య‌స్కుల ఓట‌ర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం పోలింగ్ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే తొలి రెండు గంటల్లో అక్కడక్కడా ఈవీఎంల సమస్యలు తలెత్తినా ఇప్పుడు ఎక్కడా ఇబ్బందులు లేవని ఈసీ ప్ర‌క‌ట‌న చేసింది. సినిమా హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, నితిన్, రాజమౌళి, కీరవాణి, విజయశాంతి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని అంతా పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని ఈసీ చెబుతున్నా అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.

వ‌రంగ‌ల్‌, మ‌హబూబాబాద్‌, జ‌న‌గాం, సిద్ధిపేట‌, క‌రీంన‌గ‌ర్‌, రంగారెడ్డి, సంగారెడ్డిల్లో ప‌లు కంద్రాల్లో ఈవీఎం మొరాయించ‌డంతో అధికారులు ఆగ మేఘాల మీద తిరిగి ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో గంట నుంచి గంట‌న్న‌ర పాటు పోలింగ్ నిలిచిపోయింది.. ఉదయం నుంచే జనం క్యూ లైన్లలో నించున్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. నాగర్‌కర్నూలు నియోజకవర్గంలోని కల్వకుర్తి టౌన్‌లోని 94 పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు పనిచేయలేదు. బిగ్‌ఫైట్గా భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ రికార్డు స్థాయిలో కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఓట‌ర్లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బారులు తీరుతున్నారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం 11గంటల వరకు 33శాతం పోలింగ్ నమోదైంది. అలాగే కూకట్‌పల్లి నియోజకవర్గంలో 22.5శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఓటర్లు పెద్దసంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే… కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని కూడా అటు టీఆర్ఎస్, ఇటు తెలుగుదేశం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ తనయురాలు సుహాసిని, టీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

తెలంగాణాలో ఓటరు జోరు ..రికార్డు స్థాయిలో పోలింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share