టీడీపీని గంద‌రగోళంలో పడేసిన..ద‌మ్మున్న ప‌త్రిక‌!

October 5, 2018 at 3:57 pm

ద‌మ్మున్న మీడియాగా తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌క‌టించుకునే ఓ మీడియా సంస్థ .. ఇటీవ‌ల ఏపీ ఎంపీ స్థానాల‌కు సంబంధించి ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించి, ప్ర‌సారం కూడా చేసింది. ఏపీలో ప్ర‌స్తుతం టీడీపీకి ఉన్న ఎంపీల్లో చాలా మందికి టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదని చెప్పిన ఈ క‌థనం.. అదేస‌మ‌యంలో స‌గం స్థానాల్లో టీడీపీ నుంచి కొత్త‌ముఖాలు వ‌స్తున్నాయ‌ని తెలిపిం ది. ఈ క్ర‌మంలో ప‌లువురు రాజకీయ నేత‌ల వారసులు సైతం రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నార‌ని తెలిపింది. ఈక్ర‌మంలోనే రాజ‌ధాని జిల్లా గుంటూరులోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌రావుపేట స‌హా బాప‌ట్ల విష‌యాల్లో వండి వార్చిన క‌థ‌నాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. గుంటూరులోని మూడు ఎంపీ స్థానాల్లో ఒక‌టి గుంటూరు ఇక్క‌డ నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌నే ఇక్క‌డ నుంచి పోటీ చేస్తార‌ని అంటున్నారు. క‌మ్మ‌వ‌ర్గానికి చెందిన గ‌ల్లాకు ఛాన్స్ ఇచ్చినా తిరిగి గెలిచే ఛాన్స్ ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఆయ‌న‌పై కొద్దిగా వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అండ‌తో ఆయ‌న నెట్టుకు రావొచ్చు. కానీ, బాప‌ట్ల నుంచి శ్రీరాం మాల్యాద్రికి సీటు ఖాయ‌మ‌ని వార్త చెప్పుకొచ్చింది. కానీ, ఈయ‌న‌పై పార్టీ అధినేత చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేలోనే లీస్టు మార్కులు వ‌చ్చాయి. అదేస‌మయంలో ఆయ‌న ప‌ట్ల స్థానికంగా కూడా తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ప్ర‌జ‌ల్లో ఉండ‌ర‌ని, ఆయ‌న ఎలాంటి అబివృద్ధి చేశారో కూడా తెలియ‌ద‌ని ఇక్క‌డ ప్ర‌చారంలో ఉంది. పైగా ఆయ‌న విదేశాల్లోనే ఎక్కువ‌గా ఉండ‌డం, ప్ర‌యాణాల్లోనే కాలం గ‌డిపేయ‌డం వంటివి ఆయ‌న‌కు మైన‌స్‌గా మారిపోయాయి.

మ‌రి ఇంత‌లా వ్య‌తిరేక‌త వ‌స్తున్నా కూడా .. స‌ద‌రు ద‌మ్మున్న ప‌త్రిక‌కు ఇవేవీ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం అంటున్నా రు పాఠ‌కులు. ఇక‌, అత్యంత కీల‌క‌మైన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌రావుపేట‌. ఇక్క‌డ నుంచి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. భార్య చ‌నిపోయిన దుఃఖం నుంచి ఆయ‌న ఇంకా తేరుకోలేదు. పైగా అనారోగ్యంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌ప్పుకొంటే.. త‌మ‌కంటే త‌మ‌కు టికెట్ కావాల‌ని టీడీపీ నుంచి స్థానిక నాయ‌కులే క్యూ క‌ట్టారు. వీరిలో కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు, శివ‌రామ‌కృష్ణ, మంత్రులు ప్ర‌త్తిపాటి పుల్లారావు, సిద్దా రాఘ‌వ‌రావు(ప్ర‌కాశం)లు బ‌రిలో ఉన్నారు.

అయినా కూడా క‌థ‌నం మాత్రం జిల్లాతో సంబంధం లేని, అక్క‌డెక్క‌డో క‌ద‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పుట్టా మ‌హేష్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టుగా క‌థ‌నం పేర్కొంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వేలో పైన పేర్కొన్న వారి పేర్ల‌తోపాటు రాయ‌పాటి కుమారుడు రాయ‌పాటి రంగారావు పేరు మాత్ర‌మే ఉంది. పుట్టా మ‌హేష్ పేరు ఎక్క‌డా కూడా లేదు. కానీ, ప‌త్రిక రాత‌లు మాత్రం పుట్టాను ఆకాశానికి ఎత్తేశాయి. దీంతో ఒక్క‌సారిగా టీడీపీలో క‌ల‌క‌లం రేగింది. స్థానికుడు కాదు,పైగా రాజ‌కీయంగా కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు బ‌లంకూడా లేదు. టికెట్ ఇచ్చినా గెలిచే స‌త్తా అంత‌క‌న్నా లేదు. మ‌రి ఈ రాతలు ఎందుకు రాసిన‌ట్టు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీటిని టైంపాస్ రాత‌లు అనుకోవ‌చ్చునేమో!? అని స‌టైర్లు విసురుతున్నారు నెటిజ‌న్లు.

టీడీపీని గంద‌రగోళంలో పడేసిన..ద‌మ్మున్న ప‌త్రిక‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share