జ‌న‌సేన‌లోకి నాగ‌బాబుకు ఎందుకు వెళ్ల‌లేదు

మెగా ఫ్యామిలీలో మెగా బ్ర‌ద‌ర్స్ రూటే స‌ప‌రేటుగా ఉంటుంది. నిన్న‌టి వ‌ర‌కు నాగ‌బాబు అన్న చిరంజీవికి స‌పోర్ట్‌గా ఉండేవారు. చాలా ఫంక్ష‌న్ల‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డేవారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నాగ‌బాబు ప‌వ‌న్‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నాగ‌బాబు త‌న తాజా ఇంట‌ర్వ్యూలో తాను జ‌న‌సేన‌లోకి ఎందుకు వెళ్ల‌లేదో చెప్పారు.

తాను రాంచ‌ర‌ణ్‌తో తీసిన ఆరెంజ్ సినిమాతో చాలా దెబ్బతిన్నానని.. పవన్ కల్యాణ్ చాలా సపోర్ట్ ఇవ్వ‌డంతో తాను ఆ ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్టు నాగ‌బాబు చెప్పారు. ఇక త‌న త‌మ్ముడు స్థాపించిన జ‌న‌సేన పార్టీ గురించి కూడా నాగ‌బాబు స్పందించారు. తాను జనసేన పార్టీలోకి రావడమనేది కళ్యాణ్ ఇష్టాఇష్టాల మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పిన నాగ‌బాబు ప‌వ‌న్ పార్టీలోకి ర‌మ్మంటే త‌ప్ప‌కుండా జ‌న‌సేన‌లో చేర‌తాన‌ని చెప్పారు.

ఇక తాను జ‌నసేన‌లో అంద‌రిలా ఓ సాధార‌ణ కార్య‌క‌ర్తలా ప‌నిచేస్తాన‌ని నాగ‌బాబు చెప్పారు. తాను పార్టీలోకి వస్తే పవన్‌కు ప్లస్ కాకున్న పర్వాలేదు కానీ మైనస్ కాకూడదని ఆలోచిస్తున్నానన్నారు. పార్టీలో తాను ఎలాంటి ప‌ద‌వులు కోరుకోవ‌డం లేద‌ని చెప్పిన నాగ‌బాబు… తాను లైఫ్‌లో చాలా కష్ట‌ప‌డ్డాన‌ని, ఇక‌పై అంత క‌ష్ట‌ప‌డ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే ప‌వ‌న్ త‌న‌ను పార్టీలోకి పిలిచి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని నాగ‌బాబు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

పవన్ అంటే తనకు వ్యక్తిగా చాలా ఇష్టమన్నారు. వ్యక్తిగా పవన్ అమేజింగ్ పర్సన్ అని నాగబాబు కితాబిచ్చారు. ఇదిలా ఉంటే జ‌నసేన నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పేరు కాకినాడ ఎంపీ సీటుకు విన‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే.