మోడీ మూడేళ్ల పాల‌న‌పై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ ప‌గ్గాలు చేప‌ట్టి మూడేళ్ల‌వుతోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు పీఎం అయిన మోడీ ఈ మూడేళ్ల‌లో ఎన్నో స‌క్సెస్ ఫుల్ విజ‌యాలు అందుకున్నారు. అలాగే ఆయ‌న‌కు కొన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్స్ దిమ్మ‌తిరిగి మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాయి. బెంగాల్‌, త‌మిళ‌నాడు, బిహార్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోరంగా దెబ్బ‌తింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి.అయినా మోడీ పాల‌న ప‌ట్ల చాలా మంది సంతృప్తిగానే ఉన్నారు.

ఈ మూడేళ్ల‌లో మోడీ పాల‌న ప‌ట్ల చాలా స‌ర్వేలే జ‌రిగాయి. ఈ స‌ర్వేల‌న్నింటిలోను మోడీ మ‌రోసారి పీఎం కావాల‌ని జ‌నాలు కోరుకున్నారు. తాజాగా మోడీ ప్ర‌ధాన‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టి మూడేళ్ల‌వుతోన్న వేళ ప్ర‌ముఖ ఇంగ్లీష్ దిన‌ప‌త్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వ‌హించింది. ఈ ఓటింగ్‌లో పాల్గొన్న 10 ల‌క్ష‌ల మందిలో ఎక్కువ మంది మోడీకి మ‌ద్ద‌తుగా ఓటేశారు.

ఈ ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో 77 శాతం మంది మోడీ పాల‌న బాగుంద‌ని సంతృప్తి వ్య‌క్తం చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో పాటు స్వ‌చ్ఛ భార‌త్‌కు ఎక్కువ మంది ఓటేశారు. అయితే నార్త్‌లో మోడీకి ఎక్కువ మంది ఓటేసినా సౌత్ ఇండియాలో మాత్రం కాస్త వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో మోడీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. తమిళనాడు ప్రజానీకాన్ని మోడీ పరిపాలన పెద్దగా ఆకర్షించలేదు.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే మోడీ స‌ర్కార్ 2014 ఎన్నిక‌ల కంటే మంచి ఫ‌లితాలు సాధిస్తుంద‌ని టైమ్స్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇక 84 శాతం మంది బీజేపీకి ఓటేశారు. 61 శాతం మంది మాత్రం గ‌త ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే అంత‌టి ఘ‌న‌విజ‌యం బీజేపీకి ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని చెప్పారు. 23 శాతం మంది మాత్రం 2014 ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమవుతాయని చెప్పారు.