శివాజీ.. కాస్త బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడ‌రాదే..!

May 8, 2018 at 11:12 am
sivaji-

అటు వెండితెర‌పైనా స‌క్సెస్ కాలేక‌, ఇటు రాజ‌కీయ తెర‌మీదా స‌క్సెస్ కాలేక అల్లాడుతున్న హీరో శివాజీ.. రాజ‌కీయంగా ఇటీవ‌ల కాలంలో మెర‌వాల‌ని ఎంత ప్ర‌య‌త్నించినా ఇక్క‌డా సరైన ప్లాట్ ఫాం ల‌భించ‌డం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఏపీ రాష్ట్ర‌ విభ‌జ‌నస‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శివాజీ.. ప్ర‌జా రాజ‌ధాని హైద‌రాబాద్ అంటూ.. పెద్ద ఎత్తున మీడియా ముందుకు వ‌చ్చాడు. రాష్ట్ర విభ‌జ‌న చేయొద్దంటూ స‌మైక్య ఉద్య‌మాల్లో పాలు పంచుకున్నాడు. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎటు ఎవ‌రి ప‌క్షం వ‌హిస్తున్నారో అర్ధం కాని ప‌రిస్థితి ఉంది. కొంత సేపు ఆయ‌న బీజేపీకి అనుకూలం మాట్లాడ‌తాడు. ఆ త‌ర్వాత కొన్నాళ్లు.. టీడీపీకి అనుకూలంగా మాట్లాడ‌తాడు. 

 

ప్ర‌త్యేక హోదా విష‌యంలో పెద్ద ఎత్తున చంద్ర‌బాబును విమ‌ర్శించాడు. హోదా వ‌ద్ద‌ని చంద్ర‌బాబు చెబితే.. హోదా తీసుకురాకుండా ప్యాకేజీకి ఒప్పుకుంటే.. తాను బాబు ఇంటి గుమ్మంలోనే శ‌వ‌మై క‌నిపిస్తాన‌ని పెద్ద ఎత్తున మీడియాలో సంచ‌ల‌నాలు రేపాడు. అయితే, ఆ వ్యాఖ్య‌లు అంద‌రూ మ‌రిచిపోయి ఉంటార‌నిఆయ‌న అనుకుని ఉండొచ్చు. కానీ, ఎవ‌రూ మ‌రిచిపోలేదు. ఇక, ఆ త‌ర్వాతం చ్రంద్ర‌బాబు ప్యాకేజీకి ఓకే చెప్పారు. ప్యాకేజీ గొప్ప‌ది.. హోదా దిబ్బ‌లోది! అంటూ బాబు కామెంట్లు చేసినా.. శివాజీ రివ‌ర్స్ అటాక్ చేయ‌లేక‌పోయాడు. ఇక హోదా కోసం ఆయ‌న రోడ్డు మీద‌కు వ‌చ్చింది కూడా లేదు. పైగా తాను హోదా కోరుకున్న వారిలో ప్ర‌ముఖుడిన‌ని చెప్పుకోవ‌డ‌మే త‌ప్ప హోదా కోసం ఏం చేశాడో చెప్ప‌డు.

 

ఇప్ప‌టి వ‌ర‌కు హోదా విష‌యంలో బాబును ఒక్క కామెంట్ కూడా చేయ‌లేదు. పైగా ఇప్పుడు ఏకంగా ప్ర‌ధాని మోడీకి అధికార దాహం ఎక్కువ‌ని, చచ్చిపోయే వ‌ర‌కు కూడా ఆయ‌నే ప్ర‌ధానిగా ఉండాల‌ని భావిస్తున్నార‌ని శివాజీ సంచ‌ల‌న కామెంట్లు చేశాడు. అయితే, నిజానికి ఏపీలో చంద్ర‌బాబు మాత్రం త‌క్కువ తిన్నాడా..?  క‌నీసం రాబోయే 30 సంవ‌త్స‌రాలు పార్టీ ప్ర‌భుత్వంలోనే ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బాబు అనేక వేదిక‌ల‌పై చెప్పాడు “ఎప్ప‌టికీ మ‌న‌మే!“ అనే పెద్ద పెద్ద శీర్షిక‌ల‌తో ఆయ‌న అనుకూల మీడియా కూడా ప్ర‌క‌టించింది. 

 

అంతేకాదు, “త‌మ్ముళ్లూ.. మ‌న‌కు ప్ర‌తిప‌క్షాలు అవ‌స‌ర‌మా?  ఆపార్టీల‌ను త‌రిమి కొట్టండి. ఆ నాయ‌కులు వ‌స్తే.. త‌లుపులు మూసేసుకోండి“ అని బాబు పిలుపు నిచ్చాడు. మ‌రి ఇలాంటి వ్యాఖ్య‌ల‌పై శివాజీ ఎన్న‌డూ స్పందించ‌లేదు. రాజ‌కీయాలు, శివాజీనే.. చెప్పిన‌ట్టు.. నిఖార్స‌యిన రాజ‌కీయాలు చేయాల‌నుకుంటే.. త‌ప్పు ఎవ‌రు చేసినా.. త‌ప్పుడు వ్యాఖ్య‌లు ఎవ‌రు చూసినా స్పందించాలి. అంతేకానీ ఒక స్ట్రాట‌జీ లేకుండా చేసే ప్ర‌యాణం ఎక్క‌డ ఆగిపోతుందో , గ‌మ్యం లేని ప్ర‌యాణం ఎటు వెళ్తుందో శివాజీకి తెలియ‌నికావు. రాజ‌కీయాల్లోనూ అంతే!! 

శివాజీ.. కాస్త బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడ‌రాదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share