న‌టి పొర‌పాటు.. సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు..

June 17, 2018 at 11:04 am
tollywood, rocket, usa, heroine mistake,

ఓ న‌టి చేసిన పొర‌పాటు షికాగోలో తెలుగు హీరోయిన్ల‌తో న‌డిపిస్తున్న సెక్స్‌రాకెట్ గుట్టుర‌ట్ట‌యింది. అనుకున్న స‌మాయానికి రాకుండా.. రెండు రోజులు ఆల‌స్యంగా రావ‌డంతో అస‌లు క‌థ బ‌య‌ట‌ప‌డింది. అమెరికాలో కిష‌న్ చంద్ర అనే దంప‌తులు ఎన్నో ఏళ్లుగా గుట్టుగా నిర్వ‌హిస్తున్న‌ వ్య‌బిచార దందా బ‌ట్ట‌బ‌య‌లైంది. ఈ ఘ‌ట‌న వెలుగుచూడ‌డంతో టాలీవుడ్ ఉలికిప‌డింది. తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. మొన్న‌టికి మొన్న ఇండ‌స్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ జ‌రుగుతుందంటూ శ్రీ‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌తో పెద్ద దుమార‌మే రేగింది.

ఆ ఎపిసోడ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇంత‌లోనే షికాగో ఘ‌ట‌న మ‌రోసారి టాలీవుడ్‌ను బ‌జారుకీడ్చింది. ఇంత‌కీ.. నటి చేసిన పొర‌పాటు ఏమిటంటే… అమెరికాలో ఉంటున్న కిష‌న్ చంద్ర దంప‌తులు తెలుగు సంఘాల పేరుతో లెట‌ర్‌హెడ్స్ రూపొందించి, వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెబుతారు. అయితే అంద‌రితో కాకుండా.. గుట్టుగా ముందుగానే మాట్లాడుకున్న వారికి వీసాలు ఇప్పిస్తారు. ఇందుకు కొంద‌రిని ప్ర‌దర్శ‌న‌లు ఇవ్వ‌డానికి, మరికొంద‌రిని అతిథులుగా పిలుస్తారు. ఈ క్ర‌మంలోనే ముందుగా మాట్లాడుకున్న వారితో వ్య‌భిచారం చేయించి, ఒప్పుకున్న విధంగా డ‌బ్బులు ఇచ్చేసి మ‌ళ్లీ పంపిస్తారు.

ఇలా చాలామంది హీరోయిన్లను టాలీవుడ్‌తోపాటు క‌న్న‌డ నుంచి కూడా తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ తతంగం షికాగోలో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలోనే ఓ న‌టికి కిష‌న్ చంద్ర దంప‌తులు వీసా ఇప్పించారు. 2017 న‌వంబ‌ర్ 8న‌ కాలిఫోర్నియాలో నిర్వ‌హించిన స్టార్ నైట్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి లెట‌ర్ పంపారు. అయితే అనుకున్న స‌మ‌యానికికంటే.. రెండురోజుల ఆల‌స్యంగా ఆమె వ‌చ్చింది. అంతేగాకుండా కాలిఫోర్నియా నుంచి చికాగోకు ఆ న‌టి వెళ్లింది. ఇక్క‌డే చిక్కొచ్చిప‌డింది.

ఆ ఈ వెంట్ ముగిసి రెండురోజులు కావ‌డం.. చికాగోకు వెళ్ల‌డంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు ఆ న‌టిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ న‌టి చెబుతున్నవిష‌యాల ఆధారంగా ఈవెంట్ నిర్వాహ‌కుల‌ను ఆరా తీసిన పోలీసులు ఆమె చేప్పేదంతా అబద్ధ‌మ‌ని తేలి, కిష‌న్ చంద్ర దంప‌తుల బాగోతం బ‌య‌ట‌ప‌డింది.

న‌టి పొర‌పాటు.. సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share