మ‌ళ్లీ గులాబీ అధినేతే… కూట‌మి క‌కావిక‌ల‌మే..

November 9, 2018 at 11:10 am
kcr copy

ఎన్నిక‌లు ముంగిట ఆయా పార్టీల‌తో పాటు ప‌లు సంస్థ‌లు స‌ర్వేలు చేయ‌డం, ఆ వివ‌రాలు వెల్ల‌డించడం స‌ర్వ‌సాధార‌ణం. ఒక్కోసారి ఈ స‌ర్వేలు ఫ‌లితాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాయి.. ఒక్కోసారి మొత్త‌మే బోల్తాప‌డుతాయి. తాజాగా దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇండియా టుడే స‌ర్వే చేసింది. ఈ సర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెలువ‌డ్డాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ స‌ర్వే ఫ‌లితాలు చెబుతున్నాయి. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతార‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు ఆయ‌న వైపే ఉన్నార‌ని తేలింది. ఇది నిజంగా ఆ పార్టీ శ్రేణుల‌కు మాంచి ఊపునిచ్చే క‌బురే.kchandrashekharrao-kuQD--621x414@LiveMint

డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని 44% మంది ప్ర‌జ‌లు కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. త‌మ‌కు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు. ఎవ‌రు ముఖ్య‌మంత్రి కావాల‌న్న అంశానికి.. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌కు 46%, టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 25%, బీజేపీ నేత‌ కిషన్‌రెడ్డికి 16%, టీజేఎస్ అధినేత‌ కోదండరాంకు 7%, ఎంఐఎం నేత‌ అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు.KCR_MEET1234

తెలంగాణ‌లోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మందిని టెలిఫోన్ లో సంప్రదించి ఇండియా టుడే సంస్థ ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌’ పేరుతో సర్వే ఫలితాలను విడుదల చేసింది. అయితే.. కేసీఆర్ కు క‌లిసి వ‌చ్చే అంశాలు ఇలా ఉన్నాయి.. 1. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్‌ అమలు చేసిన అద్భుత వ్యూహం. 2. ప్రభుత్వ అనుకూలత బలంగా ఉంది. 3. సమాజంలోని అన్ని వర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉంది. 4. కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 5. కాంగ్రెస్‌– టీడీపీ పొత్తు వారికి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. 6. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీస్తుంది.Harish_Rao_KCR_Facebook

అయితే.. ఇండియా టుడే సంస్థ వెల్ల‌డించిన స‌ర్వే ఫ‌లితాలో మ‌హాకూట‌మి నేత‌లు కంగుతింటున్నారు. ఓవైపు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు వారివారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ వెళ్తున్నారు. కానీ.. కాంగ్రెస్ నేత‌`త్వంలో మ‌హాకూట‌మి ఇంకా సీట్ల స‌ర్దుబాటు వ‌ద్దే ఆగిపోయింది. అభ్య‌ర్థుల‌నే ప్ర‌క‌టించ‌లేదు. సుమారు ఐదు వారాలుగా సీట్లపై సంప్ర‌దింపులు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో టీఆర్ఎస్‌పైనే న‌మ్మ‌కం పెరుగుతోందని ఈ స‌ర్వేతో వెల్ల‌డైంది. ముందుస్తు కొచ్చి కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు కుదురుకోక‌ముందే దెబ్బ‌కొట్టాల‌న్న వ్యూహంతో ముందుకు వ‌చ్చిన కేసీఆర్ స‌క్సెస్ అవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

మ‌ళ్లీ గులాబీ అధినేతే… కూట‌మి క‌కావిక‌ల‌మే..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share