మరో అల్లుడికి కూడా టికెట్ కావాలంట!

September 11, 2018 at 10:14 am
Telangana Rashtriya Samithi (TRS) president K Chandersheker Rao

ఒకే కుటుంబం నుంచి ఒకరి కంటె ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో అయితే ఎడాపెడా చెల్లుబాటు అవుతూ ఉంటుంది. తెలుగుదేశంలో కూడా కొన్ని కుటుంబాలకు అది కుదురుతుంది. కానీ తెరాస విషయానికి వస్తే.. ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఆ సిద్ధాంతం వర్తిస్తుంది. తతిమ్మా ఎవ్వరికీ అంత ప్రాధాన్యం దక్కదిక్కడ! అయితే ఈసారి ముందస్తు ఎన్నికల టికెట్ల పర్వంలో దానికి కాస్త మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ కుటుంబంతో పాటూ మరో కుటుంబంలో కూడా రెండు టికెట్లు ఇచ్చారు. కాగా, మరొక అల్లుడు కూడా ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నాడుట.List-of-TRS-candidates-for-Telangana-assembly-elections

కంగారు పడాల్సిన పనేం లేదు. ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్న ఈ కొత్త అల్లుడు కేసీఆర్ కుటుంబానికి చెందిన వాడు మాత్రం కాదు. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, వారి కుటుంబానికే చెందిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కేసీఆర్ అల్లుడు తన్నీరు హరీశ్ రావు లు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మరో అల్లుడు టీన్యూస్ ఛానెల్ ఎండీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు.

కాగా, ప్రస్తుత టికెట్ కేటాయింపుల్లో ఒక్క పట్నం వారి కుటుంబంలో మాత్రమే రెండు టికెట్లు దక్కాయి. పట్నం మహేందర్ రెడ్డికి, ఆయన సోదరుడు నరేంద్ర రెడ్డికి కూడా టికెట్లిచ్చారు. ఈలోగా, మరో అ ల్లుడు కూడా టికెట్ కోరుకుంటున్నారుట. ఆయన మరెవ్వరో కాదు.. మంత్రి నాయని నర్సింహా రెడ్డి అల్లుడు వి.శ్రీనివాస రెడ్డి. ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుంటున్నారు.Nayani Narasimha Reddy_1_1_0_0_0_0_0

నాయని నర్సింహారెడ్డి తెరాసలో సీనియర్ నాయకుడు. తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రి. ఆయనకు ఇటీవలి కాలంలో డైరక్టు ఎన్నికల్లో గెలిచిన చరిత్రలేదు. కాకపోతే పెద్దరికాన్ని గౌరవించి ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్.. ఆ హోదాతోనే మంత్రి పదవి కట్టబెట్టారు. ఆయన చాలా తరచుగా వివిధ కార్మిక సంఘాల ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోతూ ఉంటారు. అలిం నాయని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని ముచ్చటపడుతున్నారట.

కావచ్చు గానీ.. ఇలా మందిని వెంటేసుకుని.. మామ ఇంటి వద్దకు టికెట్ ఇప్పించాలని అడిగితే పనైపోతుందా? టికెట్స్ డిసైడ్ చేసే అధికారం ఉన్న వారిని నేరుగా సంప్రదించగల యాక్సెస్ ఆయనకు లేకుండాపోయిందా? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

మరో అల్లుడికి కూడా టికెట్ కావాలంట!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share