పండగ చేసుకుంటున్న గులాబీదళం!

November 10, 2018 at 11:14 pm

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల్లో ఇప్పుడు పండగ వాతావరణం కనిపిస్తోంది. ఉత్సాహాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. గులాబీ పార్టీని మట్టి కరపించడం అనే లక్ష్యంతో ఏర్పడిన మహా కూటమి కుమ్ములాటలతో సతమతం అయిపోతున్న సందర్భంలో.. తెరాసకు ఇది ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ కుమ్ములాటల్లోంచి అటు కాంగ్రెస్ గానీ, మిగిలిన పార్టీలు గానీ బయటపడేలోగా పుణ్యకాలం కాస్తా గడచిపోతుందని.. ఇదంతా ఎన్నికల్లో ఖచ్చితంగా తమకు ఎడ్వాంటేజీ అవుతుందని వారు అంచనా వేస్తున్నారు.On-New-Year-eve--KCR-stuns-Andhrites--1514803366-1910

కాంగ్రెస్ పార్టీ… పొత్తుకుదుర్చుకున్న పార్టీల విషయంలో చాలా అవమానకరంగా ప్రవర్తించింది. సీపీఐ ఇప్పుడు వారి మీద మంటెత్తిపోతున్నది. కాంగ్రెస్ వారికి మూడు స్థానాలు కేటాయిస్తే.. కాదు కూడదు.. మేం 5 చోట్ల పోటీచేస్తున్నాం అంటూ పేర్లతో సహా ప్రకటించేసిన సీపీఐ- అక్కడ మీరు కూడా నామినేషన్లు వేశారంటే.. మీ అంతు తేలుస్తాం అన్నట్లుగా కాంగ్రెస్ కు హెచ్చరిక కూడా జారీ చేసింది.chada3

సీపీఐకు వాటాగా దక్కిన మూడు సీట్లు కాకుండా, మిగిలిన రెండు సీట్లలో కాంగ్రెస్ గనుక నామినేషన్లు వేసిందంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీచేసే ప్రతి నియోజకవర్గంలోనూ తాము నామినేషన్లు వేస్తాం అనేది సీపీఐ హెచ్చరిక! ఇదే జరిగితే.. కాంగ్రెస్ కు భంగపాటు తప్పదు. కేసీఆర్ మీద అంతో ఇంతో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని… అది కాస్తా చీలిపోకుండా జాగ్రత్తగా ఇతర పార్టీలను మభ్యపెడితే గనుక.. అధికారం తమకు దక్కుతుందని కాంగ్రెస్ అనుకుంటూ వచ్చింది.

కానీ తెలంగాణలో దాదాపుగా చాలా ప్రాంతాల్లో పరిమితమైన బలాన్ని కలిగి ఉండే సీపీఐ ఇప్పుడు ఎదురుతిరిగే పరిస్థితి వస్తే.. తాము పోటీచేసే అన్ని స్థానాల్లో వారు బరిలోకి దిగితే.. ఖచ్చితంగా చాలా సీట్లను కోల్పోవాల్సి వస్తుంది. అలాగని.. సీపీఐ అడుగుతున్న ఆ మిగిలిన రెండు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను పోటీకి దింపకుండా ఆగితే.. వారు ఓ మెట్టు దిగినట్టు అవుతుంది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ నేతలు తిరుగుబాటుగా పోటీచేయకుండా ఆపే సత్తా కాంగ్రెస్ కు లేదు. ఇలాంటి చికాకుల మధ్య కూటమి పార్టీలు సతమతం అవుతోంటే.. ఈ వాతావరణం తమకు ఎడ్వాంటేజీ అని.. తెరాస సంబరపడుతోంది.

పండగ చేసుకుంటున్న గులాబీదళం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share