ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు..!

January 11, 2019 at 10:46 am

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వరుసగా ఎన్నికలు జరుగనున్నాయి. జనవరిలో పంచాయతీ ఎన్నికలు వచ్చే నెలలో సహకార ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో శాసన మండలి ఎన్నికలు కూడా తరుముకొస్తున్నాయి. తెలంగాణ శాసన మండలిలో ఏకంగా 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మార్చి 29 తో 8 మంది ఎమ్మెల్సీ ల పదవీకాలం పూర్తవుతుండగా, మరో నలుగురు ఎమ్మెల్సీ రాజీనామా చేసారు. దీంతో ఈ పన్నెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. 

టీఆర్ ఎస్ లో అతిరథ మహారథులు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. అటు పార్టీకి ఇటు కేసీఆర్ కు విధేయులుగా ఉన్నవారు, కేటీఆర్ కు సన్నిహితులుగా మెలిగే వారు, ఉద్యమంలో పాల్గొన్న వారు, పార్టీ ఆవిర్భవం నుంచి పనిచేస్తూ ఇప్పటికి అవకాశం రానివారు, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసినవారు ఇలా అనేకమంది ఆశావాహులు తెరపైకి వస్తున్నారు.

రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్ కు మరోసారి ఎమ్మెల్సీ బెర్త్ ఖాయమని భావిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవీ ప్రసాద్ ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. పాతూరి సుధాకర్ రెడ్డి సిట్టింగ్ స్థానంపై ధీమాగా ఉన్నారు. అయితే టీఎస్ పీఆర్టీయూ తరపున మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ అభ్యర్థిగా కూర రఘోత్తమ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. వీరిలో టీఆర్ ఎస్ మద్దతు ఎనరికి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పూల రవీందర్ టీఆర్ ఎస్ లో చేరిన దృష్ట్యా ఆయనకే పార్టీ మద్దతు లభించనుంది. మరోపక్క తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సుధీర్ రెడ్డి,  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నప రెడ్డి, వేనేపల్లి చందర్ రావు, కరీంనగర్‌ మేయర్ రవీందర్ సింగ్, చంద్రశేఖర్ గౌడ్, మల్లేశ్, చంద్రశేఖర్ రెడ్డి  తో పాటు ఉమ్మడి జిల్లాల టీఆర్ ఎస్ అధ్యక్షులు టిక్కెట్ ఆశిస్తున్నారు. 

ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share