సండ్ర‌..నాగేశ్వ‌ర‌రావుకు కెసిఆర్ బంఫర్ ఆఫ‌ర్‌..

January 9, 2019 at 5:02 pm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ నుంచి కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే విజ‌యం సాధించారు. అది ఖ‌మ్మం నుంచి. టీడీపీ టికెట్ పై గెల్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య – అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మంగళవారం టీఆర్ ఎస్ సీనియర్ నేత – మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో గంటకుపైగా భేటీ అయ్యారు. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు తుమ్మ‌ల‌తో భేటీకావ‌డం ఇప్పుడు రాజ‌కీయ ప్రాధాన్యం సంత‌రించుకుంది. వాస్త‌వానికి గెలిచిన నాటి నుంచే వీరిద్ద‌రు టీఆర్ ఎస్‌లోకి వెళ్లిపోతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కొద్దిరోజులు ఈ ప్ర‌చారం ఆగిన మంగ‌ళ‌వారం జ‌రిగిన భేటీతో మ‌ళ్లీ మొద‌లైంది. ఇక ఇద్ద‌రు నేత‌లు టీఆర్ ఎస్‌లో చేరితో మంచి ప్రాధాన్యం ఇస్తామ‌ని గులాబీ అధిష్ఠానం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చిదని తెలుస్తోంది.

వీరిద్ద‌రిలో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు కొద్దిరోజుల ముందే ఇలా తుమ్మ‌ల‌తో భేటీ జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వెలువ‌డుతోంది. టీడీపీని తెలంగాణ‌లో లేకుండా చేయాల‌ని కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్న నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైతే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి కూడా ఏమాత్రం సంకోచించ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది వారు వినిపిపిస్తున్న వాద‌న‌. అదే జ‌రిగితే ఇక టీడీపీకి తెలంగాణ‌లో నూక‌లు చెల్లిన‌ట్లేన‌ని అనుకోవాల్సి ఉంటుంది. ఉన్న ఇద్ద‌రు కూడా టీఆర్ ఎస్‌లోకి జంప్ అయితే పార్టీ ఆవిర్భావం నుంచి తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండాపోతోంది. చంద్ర‌బాబు కూడా ఇద్ద‌రు నేత‌ల‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌కుండా ఉంటే ఉండండి పోతే పొండి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం కూడా వారు టీఆర్ ఎస్ వైపుకు మొగ్గేలా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

టీడీపీకి ఒక‌ప్పుడు ఈ జిల్లా కంచుకోట‌. దీనికి రాష్ట్రంలో బాబు..అంత‌కు ముందు ఎన్టీఆర్ వేసిన పాదులైతే.. మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం ఇందుకు కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. ఇక రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధికారంలోకి రావ‌డంతో తుమ్మ‌ల‌ను పార్టీలోకి చేర్చ‌డంలో కేసీఆర్ విజ‌య‌వంతమ‌య్యారు. తుమ్మ‌ల చేరిక‌తో జిల్లాలో టీఆర్ ఎస్‌కు ఎదురులేకుండాపోయింది. జిల్లా రాజ‌కీయాన్ని అంత‌టిని గులాబీ గూటికి చేర్చిన తుమ్మ‌ల‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి స‌త్క‌రించారు. కేసీఆర్ అంచ‌నాల‌ను ఏమాత్రం తగ్గ‌కుండా ఆయ‌న త‌న‌ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారు. ఇప్పుడు చేరిక‌ల్లోనే ఆయ‌న ఆప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తే తుమ్మ‌ల‌కు మ‌ళ్లీ మంచి పోజిష‌న్ ఖాయ‌మ‌నే సంకేతాలు క‌న‌బ‌డుతున్నాయ‌ట‌.

సండ్ర‌..నాగేశ్వ‌ర‌రావుకు కెసిఆర్ బంఫర్ ఆఫ‌ర్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share