జ‌గ‌న్ త‌రుపున విశాల్ ప్ర‌చారం..!

June 12, 2018 at 10:42 am
jagan-vishal

విశాల్‌.. అటు త‌మిళంలో, ఇటు త‌మిళంలో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో. త‌న‌దైన శైలితో సామాన్య ప్ర‌జ‌లకూ ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఆయ‌న సినిమా అభిమ‌న్యుడుకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో సినిమా విజ‌యాన్ని విశాల్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప‌లు ప్రాంతాల్లో విజ‌యోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. ఇక్క‌డివ‌ర‌కు బాగానే.. విశాల్‌లో మ‌రోకోణం కూడా ఉంది.. అదేమిటంటే.. ఆయ‌న‌ది పొలిటిక‌ల్ మైండ్‌సెట్ కూడా.. త‌మిళ ఇండ‌స్ట్రీలో ప‌లు సంద‌ర్భాల్లో విశాల్ స్పందించిన తీరు అంద‌రికీ తెలిసిందే. 

 

ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ సంఘంలో కీల‌క బాధ్య‌త‌లు కూడా నిర్వ‌ర్తిస్తున్నారు. అక్క‌డ జరిగిన ఓ అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప‌ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతితో జ‌రిగిన ఆర్కే న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసినా అది తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. దీని వెన‌క అనేక రాజ‌కీయ కుట్ర‌లు ఉన్న‌ట్టు కూడా అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

 

అయితే.. ఈ పొలిటిక‌ల్ మైండ్‌సెట్ ఉన్న హీరో విశాల్‌కు వైఎస్సార్ కుటుంబానికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ట‌. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ అంటే.. విశాల్‌కు ఎక్క‌డాలేని గౌర‌వ‌మ‌ట‌. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుఫున ఆయ‌న ప్ర‌చారం చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటికి మ‌రింత బ‌లాన్ని ఇచ్చేలా విశాల్ ప‌ర్య‌ట‌న కొన‌సాగింది. ఇంత‌కీ ఏమిటా ప‌ర్య‌ట‌న అంటే..అభిమ‌న్యుడు విజ‌య‌వంతం న‌డుస్తున్న సంద‌ర్భంగా ఆయ‌న విశాఖ వెళ్లాడు. ఇక్క‌డ త‌న కార్య‌క్ర‌మాలు ముగించుకుని విశాఖ ఎస్ఈజెడ్‌ కంపెనీకి వెళ్లారు. ఈ కంపెనీకి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. 

 

ఆసియా ఖండంలో మ‌హిళ‌లు అత్య‌ధిక సంఖ్య‌లో ప‌నిచేస్తున్న సంస్థ‌గా గిన్నిస్ రికార్డు కూడా ఉంది. అంతేగాకుండా.. విశాఖ జిల్లాలోని గ్రామాల‌కు చెందిన సుమారు 18వేల‌మంది మ‌హిళ‌లు ఇక్క‌డ ప‌నిచేస్తున్నారు. వీళ్లంతా కూడా అన్‌స్కిల్డ్ కార్మికులే. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ లోక్‌స‌భ స్థానం నుంచి వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ బ‌రిలోకి దిగి ఎంపీ హ‌రిబాబు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వైసీపీ మ‌ళ్లీ విశాఖ స్థానంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో పావులు క‌దుపుతున్నట్లు స‌మాచారం. 

 

ఇందులో భాగంగానే.. హీరో విశాల్ త‌న ప‌ర్య‌ట‌న‌ను విశాఖ‌లో సినిమా కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమితం చేయ‌కుండా ఇత‌ర అంశాల‌పై కూడా దృష్టిసారించార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే విశాల్ త‌న‌కు ఏపీ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ అంటే ఇష్ట‌మ‌ని… జ‌గ‌న్ లాంటి డైన‌మిక్ లీడ‌ర్లు కావాల‌ని చెప్పారు. ఈ మాట‌ల్లో విశాల్ ప‌రోక్షంగా త‌న మ‌ద్ద‌తు జ‌గ‌న్‌, వైసీపీకి ప్ర‌క‌టించాడా ? అన్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. అంత‌మంది మ‌హిళ‌లు ఉన్న చోట‌కు వెళ్లి ఇలా జ‌గ‌న్ గురించి మాట్లాడ‌డం చూస్తుంటే అందులో రాజ‌కీయం కోణం ఉంద‌ని తెలుస్తోంది. తెలుగువాడైన విశాల్ త‌మిళ ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డ్డారు. ఇక ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో విశాల్ త‌న ప‌రోక్ష మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కు ప్ర‌క‌టించిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తాడో ?  లేదో ?  చూడాలి.

జ‌గ‌న్ త‌రుపున విశాల్ ప్ర‌చారం..!
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share