విష్ణుకుమార్ రాజుకు బీజేపీ టికెట్ నై…!

October 1, 2018 at 9:48 am

అవును! రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నాయ‌కులు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఎండ‌గ‌ట్టాల్సింది పోయి.. వారికి వ‌త్తాసుగా వ్యాఖ్య‌లు చేస్తే.. ప‌రిస్తితి ఎలా ఉంటుంది? ప్ర‌త్య‌ర్థి నాయ‌కుల‌ను పొగ‌డ్త‌ల‌తోనూ ముంచెత్తితే ప‌రిస్థితి ఎలా ఉంటుంది ? ఇప్పుడు వీటికి స‌మాధానం బీజేపీ విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే విష్ణ‌కుమార్ రాజు వ్య‌వ‌హారి శైలి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు., విష‌యంలోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోను, ఆ త‌ర్వాత రెండేళ్లు గ‌డిచిన త‌ర్వాత ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. ముఖ్యంగా చంద్ర‌బాబు కేంద్ర‌లోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి పూర్తిగా మారి పోయింది. 24VJVRA2VishnuGUL3A1SKV3jpgjpg

బీజేపీ నేతలు రాష్ట్రంలో చంద్రబాబుపై కత్తులు నూరుతున్నారు. ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న సమయంలో కూడా మోడీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని.. చివరకు బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్‌ ఊసెత్తలేదని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కూడా అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారీ విరుచుకుపడుతున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజానీకానికి పదేపదే గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజనతో అన్యాయం చేస్తే….బీజేపీ నమ్మించి మోసం చేసిందని టీడీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ శాసనసభాపక్ష నేతల విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో చిచ్చురేపాయి.

పోలవరం గ్యాలరీ వాక్‌కు వెళ్లిన విష్ణుకుమార్‌రాజు అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. పట్టిసీమ…పోలవరం ప్రాజెక్టులు మంచివని.. పట్టిసీమ లేని పక్షంలో కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయేదని.. చంద్రబాబు చేసిన ప్రయత్నం వల్ల కృష్ణా డెల్టాలో మూడేళ్లుగా పంట చేతికందుతుందని వ్యాఖ్యానించారు. కానీ పట్టిసీమ…పోలవరంలో అవినీతి జరిగిందని చూచాయ‌గా చెప్పారు. శాసనసభలో చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లపై జరిగిన సుదీర్ఘ చర్చలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ చంద్రన్న బీమాకు ముందు ప్రధానమంత్రి చంద్రన్న భీమా అని నామకరణం చేయాలని కోరారు. ఈ రెండు పధకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.

ప్రత్యేకహోదా.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానంపై విష్ణుకుమార్ రాజు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ … ముఖ్యమంత్రి సూచనతో తీర్మానాన్ని బలపరిచారు విష్ణుకుమార్‌రాజు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలైతే మౌనంగా తీర్మానాన్ని బలపరుస్తామని ప్రకటించి మద్దతు తెలిపారు. పలు సందర్భాలలో ముఖ్యమంత్రిని విష్ణుకుమార్ రాజు ప్రశంసించడం బీజేపీ నేతలకు సుతారమూ నచ్చలేదు. తామంతా ప్రభుత్వ పని తీరును తప్పుబడుతుంటే విష్ణుకుమార్ రాజు శాసనసభలో అందరి సాక్షిగా ముఖ్యమంత్రిని పొగడటం పట్ల వారు హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విష్ణుకు టికెట్‌ను దూరం చేసేలా ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

విష్ణుకుమార్ రాజుకు బీజేపీ టికెట్ నై…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share