చంద్ర‌బాబుపై అప్ప‌టి ప‌గ తీర్చుకుంటోన్న పురందేశ్వ‌రి

September 16, 2017 at 11:14 am
chandra babu , daggubati purandeswari

అవును. ఇప్పుడు బీజేపీ వ‌ర్గాల్లో ఇదే టాపిక్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో టికెట్ గురించి చిన్న‌మ్మ ఓ శ‌ప‌థం ప‌ట్టింద‌ని, సీఎం చంద్రాబుపై పైచేయి సాధించేలా త‌న పంతం నెగ్గించుకోవాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని అంటున్నారు బీజేపీ నేత‌లు. 2014లో త‌న‌కు బాబు చేతిలో జ‌రిగిన అవ‌మానానికి రెట్టింపు ప్ర‌తీకారం తీర్చేయాల‌ని ఆమె డిసైడ్ అయ్యార‌ని అంటున్నారు. రాజ‌కీయంగా త‌న‌ను తాను నిరూపించుకునేందుకు కూడా పురందేశ్వ‌రి సిద్ధ‌మ‌య్యార‌ని చెబుతున్నారు. మ‌రి ఈ శ‌ప‌థం ఏమిటో? పురందేశ్వ‌రి పంతం ఏమిటో? బాబుపై పైచేయి సాధించడం ఏంటో? చూద్దాం పదండి..

నంద‌మూరి అన్న‌గారి కుటుంబానికి చెందిన పురందేశ్వ‌రిని కుటుంబం యావ‌త్తూ.. చిన్న‌మ్మ అని పిలుచుకుంటుంది. 2009 కి ముందు వైఎస్ దీవెన‌ల‌తో రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేసిన ఈమె.. సొంత మ‌రిది, టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఏకేయ‌డంతో పీజీ చేసిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు. త‌న మ‌న అనే తేడాలేకుండా బాబును ఏకేయ‌డంలో ఫ్యామిలీ మొత్తంలో చిన్న‌మ్మే ఫ‌స్ట్‌. అందుకే బాబును తిట్టించ‌డం కోస‌మే.. వైఎస్ అప్ప‌ట్లో పురందేశ్వ‌రికి కండువా క‌ప్పార‌నే చ‌ర్చ సాగింది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీ సీటును కూడా కేటాయించిన వైఎస్ ఆమె గెలుపున‌కు తీవ్రంగా కృషి మంచి మెజారిటీ సాధించేలా చేశారు.

అయితే, 2014కి ప‌రిస్థితి తిర‌గ‌బ‌డింది. రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో చిన్న‌మ్మ వెంట‌నే ప్లేట్ ఫిరాయించి పార్టీ మార్చేసింది. మూడు రంగుల కండువాను తీసి కాషాయ‌ద‌ళంలో చేరిపోయింది. దీంతో ఆమె మ‌ళ్లీ విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని అభ్య‌ర్థించింది. అయితే, అప్ప‌టి ఎన్నిక‌ల పొత్తులో భాగంగా బీజేపీ నేత‌లు టీడీపీ అధినేత స‌ల‌హా మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే బాబు పురందేశ్వ‌రికి అడ్డు పుల్ల వేసి.. మ‌ట్టి క‌రిచేలా వ్య‌వ‌హ‌రించార‌ని ఇప్ప‌టికీ చిన్న‌మ్మ త‌న స‌న్నిహితుల‌కు చెప్పుకొంటారు.

ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో ఏమాత్రం డిపాజిట్లు కూడా ద‌క్కే చాన్స్ లేని రాజంపేట నుంచి పురందేశ్వ‌రికి టికెట్ వ‌చ్చేలా చేశార‌ట బాబు. దీంతో ఆమె ఓడిపోయింది. ఇక‌, ఇప్పుడు ఆ క‌సిని మ‌రో రూపంలో తీర్చుకునేందుకు పురందేశ్వ‌రి రెడీ అయిన‌ట్టు స‌మాచారం. 2019లోనూ బీజేపీ-టీడీపీ క‌లిసే ఎన్నిక‌ల‌కు వెళ్తున్న నేప‌థ్యంలో హిందూపురం ఎంపీ స్తానంపై పురందేశ్వ‌రి క‌న్ను ప‌డింద‌ని అంటున్నారు. ఇక్క‌డ టీడీపీ బ‌లంగా ఉంది. నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, దీనినేతాను డిమాండ్ చేయ‌డం ద్వారా టీడీపీ బ‌లాన్ని బీజేకీ బ‌ద‌లాయించ‌డంతోపాటుత‌న పంతం నెగ్గించుకున్న‌ట్టు అవుతుంద‌ని పురందేశ్వ‌రి భావిస్తోంద‌ట‌. ఇక ఇక్కడ తాను గెలిచేందుకు కూడా మార్గం సుగ‌మం అవుతుంది. ఎందుకంటే హిందూపురంలో ఎన్టీఆర్ సెంటిమెంట్ కూడా పురందేశ్వ‌రిఇక బాగానే క‌లిసి వ‌స్తుంది.

గ‌తంలో మాదిరిగా బీజేపీ వ‌ద్ద త‌న ప‌రిస్థితి లేద‌ని, ఈ నాలుగేళ్ల‌లో బీజేపీఅధిష్టానం నాడి ప‌ట్టుకున్నాన‌ని, కాబ‌ట్టి హిందూపురం టికెట్ సంపాయించ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని ఆమె అంటోంది. కానీ, బాబుకుఈ టికెట్ ఇవ్వ‌డం ఇష్టం ఉండ‌దు. అయినా కూడా పురందేశ్వ‌రి ప‌ట్టువీడేలా లేదు. మ‌రిదిపై ప్ర‌తీకారానికి ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ఆమె భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

చంద్ర‌బాబుపై అప్ప‌టి ప‌గ తీర్చుకుంటోన్న పురందేశ్వ‌రి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share