వాట్సాప్ సంచలనం: ఇక ఆ ఫీచర్ కూడా అందుబాటులోకి

May 21, 2018 at 1:15 pm
whatsapp, New Update, Group Calling, Tech news

ఎట్టకేలకు వాట్సాప్‌ వినియోగదారులకు తీపికబురు అందింది. వాట్సాప్ వినియోగ‌దారులు ఎప్ప‌టి నుంచో క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తోన్న వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ ఆప్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో తిరుగులేని సాధ‌నంగా దూసుకుపోతోన్న వాట్సాప్ ఇప్పుడు ఈ స‌రికొత్త ఆప్ష‌న్‌తో మ‌రింత మంది వినియోగ‌దారుల‌కు చేరువ కానుంది.

 

వాట్సాప్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒకేసారి ఎక్కువ మందితో గ్రూప్ వీడియో కాల్ చేసుకునే ఆప్ష‌న్ లేదు. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ఆప్ష‌న్ల‌తో వినియోగ‌దారుల ఆద‌ర‌ణ చూర‌గొంటోన్న వాట్సాప్ ఇప్పుడు ఒకరికంటే ఎక్కువమంది గ్రూప్‌ కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ రెండు వెర్షన్లలోనూ ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.   

 

ఈ సూప‌ర్ ఆప్ష‌న్ ద్వారా వాట్సాప్ వినియోగ‌దారుల‌కు చాలా సౌల‌భ్యాలు ఉన్నాయి. ఒక గ్రూపులోని పలువురు సభ్యులు లేదా, ఒకే కుటుంబానికి  చెందిన ఇద్దరు లేదా అంతకుమించి సభ్యులు ఈ ఫీచర్‌ ద్వారా  వీడియో ద్వారా త‌మ అనుభ‌వాలు ఒకేసారి పంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో  వాట్సాప్‌ బేటా  2.18.155 వెర్షన్ వాడుతున్న ఎంపిక చేయబడిన కొంతమంది వినియోగదారులకు తాజాగా ఒక వీడియో కాల్‌ను ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. 

 

ఐవోఎస్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో  వాట్సాప్‌ 2.18.52 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు  వాట్సాప్‌ వెల్లడించింది. ప్ర‌స్తుతం ఎంపిక చేసిన కొద్దిమందికే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. త్వ‌ర‌లోనే ఈ ఆప్ష‌న్ ప్ర‌తి ఒక్క వాట్సాప్ వినియోగదారుడికి అందుబాటులోకి తేనున్నారు.

 

వాట్సాప్ సంచలనం: ఇక ఆ ఫీచర్ కూడా అందుబాటులోకి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share