య‌మ‌న్‌ TJ రివ్యూ

సినిమా : య‌మ‌న్‌
రేటింగ్ : 2.5 /5
పంచ్ లైన్ : ఆంటోనీ చరిష్మా పొయెన్

నటీనటులు : విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు.
ఎడిటింగ్‌ : వీరసెంథిల్‌ రాజ్‌
మాటలు : భాష్యశ్రీ
ఫైట్స్‌ : దిలీప్‌ సుబ్బరాయన్‌
సమర్పణ : మిర్యాల సత్యనారాయణరెడ్డి
నిర్మాతలు : మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌
సంగీతం : విజయ్‌ ఆంటోని
కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం : జీవశంకర

విజయ్ ఆంటోనీ.. ఆపేరు ఒక బ్రాండ్ అయి కూర్చుంది తెలుగులో.పెద్ద పెద్ద కార్పొరేట్ ప్రొడక్షన్ హౌస్ లకి కూడా లేని బ్రాండ్ ఇమేజ్ విజయ్ ఆంటోనీ కి బిచ్చగాడు తెచ్చి పెట్టి కోట్లు కురిపించాడు.విజయ్ ఆంటోనీ వరము, శాపము రెండూ కూడా బిచ్చగాడే. వరమెలాగంటే ఆ బిచ్చగాడు బ్రాండ్ తోనే అంతకుముందు వరకు ఆంటోనీ అంటే ఎవ్వరికీ తెలియని ఓ సాధారణ నటుడికి ఒక బ్రాండ్ ఇచ్చి, కష్టాల్లో డబ్బులిచ్చి ఆ తరువాతి సినిమాలకు ఇంకా ఓపెనింగ్స్ ని కూడా బిచ్చగాడే ఇస్తున్నాడు.ఇక శాపమేలాగంటే బిచ్చగాడు ఆంటోనీ సిన్మాలకి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసాడు.ఆంటోనీ సినిమా అంటే ఎదో ఉంటుంది అనే క్యూరియాసిటీ సెట్ చేసాడు..ఆ ఎదో తెలియని కొత్తదనం బిచ్చగాడు తరువాత ఏ సినిమాలో మిస్ అయినా అది ఢమాల్.

ఈ డేంజర్ ని భేతాళుడు కొంతవరకు అధిగమించినా య‌మ‌న్‌ వల్ల ఏ మాత్రం కాలేదు పాపం.అలాగని బిచ్చగాడు లా అన్ని బ్లాక్బస్టర్ సినిమాలే తీయాలని కాదు కానీ ఓ ముక్కు మొహం తెలియని తమిళ నటుడి సినిమాకి ఏం మినిమం ఆశించి సగటు ప్రేక్షకుడు వస్తున్నాడో అది కానరాకపోతే ఆ బ్రాండ్ ఇమేజ్ నుండి మల్లి ముక్కు మొహం తెలియని తమిళ నటుడి స్టేజ్ కి ఆంటోనీ వెళ్లడాన్ని ఎంతో టైం పట్టదు.ఎన్నో సినిమాలు కూడా అక్కర్లేదు.య‌మ‌న్‌ అందుకు తొలిమెట్టు.

కులాంతర వివాహం చేసుకున్న హీరో తండ్రి, రాజకీయ కుల ఎత్తులకు చనిపోతే ఆ బాధ తట్టుకోలేక తల్లికూడా చనిపోవడం తో తాతయ్య దగ్గర పెరిగి పెద్దవాడయిన హీరో ఎలా తన తెలివితేటలతో రాజకీయంగా ఎదిగి అనుకోకుండా తన తండ్రి చావుకి కూడా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే కతఅంశం.

ఓ కమర్షియల్ సినిమాకి కావాల్సిన ముడిసరుకంతా కథలో వుంది కానీ తెరపైన అది కనిపించదు.ఓ రాజకీయ నేపధ్యమున్న కథకి కావాల్సిన అన్ని హంగులు,మలుపులు కూడా కథలో వున్నా దర్శకుడు కథనం నడపడం లో విఫలమయ్యాడు.ముక్యంగా కథకి తగ్గ వేగం కథనం లో లోపించింది.ఇలాంటి కథలకి ఉండాల్సిన బేసిక్ స్క్రీన్ ప్లే కూడా సినిమాలో లేకపోవడం పెద్ద లోటు.హీరో క్యారెక్టరైజషన్ కూడా దర్శకుడి బలహీనతను చూపిస్తుంది.అప్పుడే ఎంతో బలంగా కనిపిస్తాడు అంతలోనే తేలిపోతాడు హీరో.

విజయ్ ఆంటోనీ పెద్ద ఎక్స్ప్రెషన్స్ పలికించగల నటుడు కాకపోయినా తనకున్న లిమిటేషన్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించగలడు.అదే అతని బలం.తన పాత్రకి ఆంటోనీ పూర్తి న్యాయం చేసాడు.హీరోయిన్ మియా జార్జ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా పాత్ర నిడివి పెద్దగా లేదు.మిగితా పాత్రలన్నీ తమిళ నటీనటులే కావడంతో మన నేటివిటీ మచ్చుకైనా కనపడదు.అందరూ ఉన్నంతలో పర్లేదనిపించారు.

ఇటువంటి కథా నేపధ్యమున్న సినిమాలకి స్క్రీన్ప్లే కీలకం.దానిపై ప్రత్యేక శ్రద్ద పెట్టకపోతే ఎంత కథలో కంటెంట్ వున్నా ఆన్ స్క్రీన్ పై అది కనిపించదు.కట్టి పడేసే సంభాషణలు ఉండాల్సిన కథా వస్తువు..డైలాగ్స్ కథకి ఏ రకంగానూ ఉపయోగపడకపోగా కథనం లోని వేగాన్ని కూడా నీరుగార్చేస్తాయి.అంత పేలవంగా వున్నాయి.ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విజయ్ ఆంటోనీ సొంత టాలెంట్ ని కాకుండా ప్రొఫషనల్ ని నమ్ముకుంటే బెటర్.పాటలగురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.కథే పడుతూ లేస్తూ నడుస్తుంటే మధ్య మధ్యలో తగిలే పాటలు చెంపపెట్టులా అనిపిస్తుంటాయి.ఎడిటింగ్ కూడా ఇంకా షార్ప్ గా కత్తెరకు పనిచెప్పొచ్చు.

ఓవర్ అల్ గా కోటీశ్వరుడయిపోయిన బిచ్చగాడు కామన్ మాన్ అవ్వడానికి రెండే సినిమాలు చాలని ప్రూవ్ చేసింది య‌మ‌న్‌.అదేనండి విజయ్ ఆంటోనీ సినిమాలన్నిట్లో ఎదో బ్రహ్మ పదార్ధం ఉండదు అవీ మాములు మూస సినిమాలే అని చెప్పడానికి య‌మ‌న్‌ పర్ఫెక్ట్ సినిమా అన్నమాట.