జ‌న‌సేన‌కి వారే పెద్ద ఆస్తి అవుతారా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. అదేసమ‌యంలో తాను అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ వెల్ల‌డించాడు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న నెత్తురు మండే క‌త్తుల్లాంటి యువ‌త‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించి.. ఇప్ప‌టికే జిల్లాల వైజ్‌గా యువ‌త‌ను పార్టీలోకి ఆహ్వానించి వారికి వివిధ రంగాల్లో ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హిస్తున్నాడు. వాస్త‌వానికి దీని వెనుక పెద్ద వ్యూహాన్నే ప‌వ‌న్ ఫాలో అవుతున్నాడ‌ని స‌మాచారం.

యువ‌కుల‌కు ఎక్క‌వ అవ‌కాశాలు ఇవ్వ‌డం ద్వారా స‌మాజాన్ని చైత‌న్య‌వంతం చేయ‌డం ఒక ఆలోచ‌న అయితే, నిజాయితీ, నీతి ఉన్న వారికి అవ‌కాశం ఇవ్వ‌డం మ‌రో వ్యూహం. వాస్త‌వానికి యువ‌త అవినీతి ర‌హితంగా ఉంటారు. వీరికి సంపాయించుకోవాల‌నే ఆశ‌లు ఉండ‌వు. దీనిని గ‌మ‌నించిన ప‌వ‌న్ త‌న ప్లాన్‌ను యువ‌త‌వైపు తిప్పారు. యువ‌త కూడా ప‌వ‌న్ వైపు తిరిగి జై కొట్ట‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో విశ్రాంత ఉద్యోగులు కూడా ప‌వ‌న్ కు పెద్ద ఆస్తిలా మారారు. వీరు కూడా అవినీతిని దూరంగా పెట్టేవారే. దీంతో ప‌వ‌న్ ఈ వ‌ర్గానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు.

నిజానికి చిరంజీవి ప్ర‌జారాజ్యంలో ప‌వ‌న్ యువ‌రాజ్యం చీఫ్‌గా బాధ్య‌త‌లు తీసుకున్నాడు. ప్ర‌జారాజ్యంలో పార్టీ టికెట్ ఇచ్చేందుకు భారీగా డ‌బ్బులు గుంజాడ‌నే ఆరోప‌ణలు చిరు బామ్మ‌ర్ది అల్లు అర్జున్‌పై వ‌చ్చినా.. యువ‌రాజ్యంపై మాత్రం ఎలాంటి మ‌చ్చా ప‌డ‌లేదు. సో.. యువ‌త నుంచి ప‌వ‌న్ ఎలాంటి ల‌బ్ధినీ ఆశించ‌కుండానే వారికి పాలిటిక్స్‌పై త‌ర్ఫీదు ఇచ్చారు. ఇప్పుడు కూడా యువ‌త‌ను ఆయ‌న చేర‌దీయ‌డం అన్ని వ‌ర్గాల్లోనూ జ‌న‌సేన‌కి మంచి మార్కులు ప‌డేలా చేసింద‌ట‌. ఇక‌, ఇదే ఊపు జ‌గ‌న్ పార్టీలో ఉంటే? ఈ సందేహం అంద‌రిలోనూ వ‌చ్చేదే. అయితే, అది సాధ్యం కాద‌ని అంటున్నారు వైసీపీ నేతలు!!