ఆనంకు జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఇదే..

July 21, 2018 at 11:26 am
jagan-anam

కాంగ్రెస్ మాజీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నెల్లూరుకు చెందిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త్వ‌ర‌లోనే వైసీపీలోకి చేర‌బోతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన ఆనం సోద‌రులు.. త‌ర్వాత ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి బ‌య‌టకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా వారు టీడీపీ బాట ప‌ట్టారు. చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రంతో వారు ఇద్ద‌రూ సైకిల్ ఎక్కారు. అప్ప‌టి ప‌రిస్థితిలో ఆనం రామనారాయ‌ణ రెడ్డికి ఎమ్మెల్సీప‌ద‌వితోపాటు మంత్రి వ‌ర్గంలోనూ చోటు క‌ల్పిస్తాన‌ని బాబు వారికి హామీ ఇచ్చారు. అయితే, అది రెండేళ్లు గ‌డిచినా వారికి నెర‌వేర‌లేదు. దీంతో వారు మౌనంగా ఉండిపోయారు. అడ‌పాద‌డ‌పా ఆనం వివేకానంద రెడ్డి అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించినా.. రామ‌నారాయ ణ రెడ్డి మాత్రం పెద‌వి విప్ప‌లేదు. 

 

అయితే, రానురాను నెల్లూరు జిల్లాలో వారి ప‌రిస్థితి దారుణంగా మారిపోవ‌డం, టీడీపీలో ఆసించిన స్థాయిలో వారికి గుర్తింపు లేక‌పోవ‌డం వంటి కార‌ణాలు తీవ్రంగా వేధించాయి., ఈ నేప‌థ్యంలోనే ఆనం వివేకా .. ఇటీవ‌ల మృతి చెందారు. ఈ ప‌రిణామం త‌ర్వాత .. ఇక‌, పార్టీలో ఉండి తాను మాత్రం సాధించేది ఏమిట‌ని రామ‌నారాయ‌ణ రెడ్డి ఓ డెసిష‌న్‌కు వ‌చ్చారు. పార్టీ మార్పున‌కే ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీలోకే వెళ్లేందుకు రెడీ అయ్యారు. వ‌చ్చే ఏడాది లేదా ముందుగానే జ‌రుగుతాయ‌ని భావిస్తున్న ఎన్నిక‌ల్లో త‌న‌కు రెండు టికెట్లు కావాల‌ని, ఒక‌టి త‌నకు రెండోది త‌న అన్న కుమారుడు మ‌యూర్‌కు కేటాయించాల‌ని జ‌గ‌న్‌ను కోరారు. దీనికి జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. అయితే, ఆనం కోరుకున్న‌ట్టు ఆత్మ‌కూరు టికెట్‌(ఇది అల్రెడీ మేక‌పాటి ఫ్యామిలీకి రిజ‌ర్వ్ అయింది) ఇవ్వ‌లేన‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు స‌మాచారం. 

 

ఈ క్ర‌మంలోనే వెంక‌ట‌గిరి టికెట్ ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు లోట‌స్ పాండ్ వ‌ర్గాలు అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున కురుగొండ్ల రామ‌కృష్ణ‌, వైసీపీ త‌ర‌ఫున కొమ్మి ల‌క్ష్మినాయుడు పోటీ చేశారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత రామ‌కృష్ణ కేవ‌లం 5 వేల ఓట్లతో విజ‌యం సాధించారు. ఇక్క‌డ కొద్దిగా క‌ష్ట‌ప‌డితే.. ఆనం గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే కానుంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఆయ‌న‌కు వెంక‌ట‌గిరి టికెట్ రిజ‌ర్వ్ చేశార‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు అంటున్నారు. ఇక‌, నెల్లూరులో పార్టీని పూర్తిగా గెలిపించే బాధ్య‌త‌ను తీసుకోవాల‌ని, ముఖ్యంగా మంత్రి నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌కు చెక్ పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల‌ని, రాబోయే రోజుల్లో పార్టీని మ‌రింత‌గా బ‌ల‌ప‌ర‌చాల‌ని జ‌గ‌న్ సూచించార‌ని తెలుస్తోంది. దీనికి ఆనం ఓకే చెప్పార‌ని స‌మాచారం. అయితే, ప్ర‌స్తుతం ఆషాఢ మాసం న‌డుస్తున్నందున వ‌చ్చే నెల శ్రావ‌ణ మాసంలో ఆనం వైసీపీలోకి చేర‌నున్నార‌ని తెలుస్తోంది. 

ఆనంకు జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఇదే..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share