నాడు జ‌గ‌న్‌పై ఓలా.. ఇప్పుడు మ‌రోలా.. బాబు స్టైలే డిఫ‌రెంట్‌!

September 21, 2018 at 10:01 am

దాదాపు ఎనిమిదేళ్ల కింద‌టి కేసును తిర‌గ‌దోడార‌ని, త‌న‌ను రాజ‌కీయంగా ఎదుర్కొన‌లేక‌.. న్యాయ వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటు న్నారని, తాను భ‌య‌ప‌డేది లేద‌ని, ఇలాంటివి త‌న జీవితంలో ఎన్నో చూశాన‌ని.. అంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. గ‌డిచిన నాలుగు రోజులుగా ఆయ‌న‌లో ఏదో ప్ర‌త్యేక‌మైన ఆందోళ‌న స్ప‌ష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా.. ఏ వేదికెక్కినా.. ఆయ‌న ఈ బాబ్లీ వివాదంపై మాట్లాడ‌కుండా.. బీజేపీ నేత‌ల‌ను కుదిరితే .. జ‌గ‌న్‌ను సైతం తిట్ట‌కుండా మాత్రం ఉండ‌లేక పోతున్నారు. వాస్త‌వానికి మ‌హారాష్ట్రంలోని బాబ్లీ ప్రాజెక్టు విష‌యంలో తాను పోరాడినందుకే, తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ఉద్య‌మించినందుకే త‌న‌పై ఇప్పుడు ఇన్నాళ్ల‌కు ధ‌ర్మాబాద్ కోర్టు నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ చేసింద‌ని ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పుకొంటే కొంత‌లో కొంత‌మేర‌కైనా ప్ర‌యోజ‌నం దక్కేది.MIf8MyHt_400x400

కానీ, చంద్ర‌బాబు మాత్రం రాష్ట్రంలోకానీ, త‌న ఫ్యామిలీలో కానీ ఏమైనా జ‌రిగితే.. దానికి బీజేపీ లేదా జ‌గ‌న్ లేదా సంయు క్తంగా కుట్ర‌లు ప‌న్ని త‌న‌పై క‌క్ష తీర్చుకుంటున్నార‌ని చెప్పుకొంటున్నారు. తాజా ఘ‌ట‌న‌లో మ‌రో రెండు అడుగులు ముందుకు వేసిన బాబుకు ఇప్పుడు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఎదురు తిరుగుతున్నాయి. నిన్న‌టికి నిన్న కోర్టు పంపిన నాన్ బెయిల్ వారెంట్‌కు బీజేపీకి సంబంధం ఉంద‌న్న‌ట్టు బాబు వ్యాఖ్యానించారు. ‘‘బాబ్లీ ప్రాజెక్టుపై ఆందోళన చేసిన ఎనిమిదేళ్లకు వారెంట్లు ఇచ్చారు. దీంతో తమకు సంబంధం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అంటున్నారు.

మరి… ఇప్పుడు మహారాష్ట్రలో, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి? ఎందుకిలా మాట్లాడుతున్నారు?’’ అని బాబు ప్ర‌శ్నించారు. ఒక‌వేళ.. చంద్ర‌బాబు ఉద్దేశం ప్ర‌కారం.. కేంద్రంలోని నరేంద్ర మోడీ, మ‌హారాష్ట్రలోని ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వాలు ధ‌ర్మాబాద్ కోర్టును మేనేజ్ చేసి.. ఎప్పుడో పాతిపెట్టిన కేసును వెలికి తీశార‌ని అనుకుంటే.. మ‌రి ఏపీకి సంబంధించిన ప‌లు కేసుల విష‌యంలోనూ చంద్ర‌బాబు ఇలానే మేనేజ్ చేస్తున్నారా? ముఖ్యంగా ఆయ‌న‌కు, ఆయ‌న ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం దాఖ‌ల‌వుతున్న కేసుల‌ను కూడా చంద్ర‌బాబు మేనేజ్ చేస్తున్న‌ట్టుగానే భావించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఏదైనా త‌న వ‌ర‌కు వ‌చ్చే స‌రికి చంద్ర‌బాబు అవ‌లంబిస్తున్న తీరుకు, విప‌క్ష నేత విష‌యానికి వ‌చ్చే స‌రికిమారుస్తున్న ప్లేటుకు మ‌ధ్య చాలా తేడా ఉంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు., గ‌తంలో జ‌గ‌న్‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర ప‌న్ని కేసులు న‌మోదు చేయించింద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, అప్ప‌ట్లో చంద్ర‌బాబు వీటిని కామెడీగా తీసుకున్నారు. న్యాయ వ్య‌వ‌స్థ ప‌విత్ర‌మైంద‌ని, అది ఎవ‌రికీ లొంగ‌ద‌ని, కానీ, జ‌గ‌న్ మాత్రం.. దానికి కూడా రాజ‌కీయాలు అంట‌గ‌డుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. మ‌రి ఇప్పుడు చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఏమ‌య్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నాడు జ‌గ‌న్‌పై ఓలా.. ఇప్పుడు మ‌రోలా.. బాబు స్టైలే డిఫ‌రెంట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share